ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి.. గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం నాడు ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు.. ఊపిరి తీసుకోవడంలో సమస్య రావటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే రామలింగేశ్వరస్వామి.. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.
ములుగు సిద్ధాంతిగా పేరొందిన రామలింగేశ్వర సిద్ధాంతి 30 ఏళ్లుగా జ్యోతిష్యులుగా సేవలందించారు. రాశి ఫలాలతోపాటు ఆయన చెప్పే జ్యోతిష్యాన్ని చాలా మంది నమ్ముతుంటారు. విదేశాల్లోని తెలుగువారు కూడా నమ్ముతారు. నిస్పక్షపాతమైన, వాస్తవ జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను అంచనా వేసి.. తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేసేవారు. ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
అందరి శ్రేయస్సు కోసం.. ఇటీవలే ములుగు సిద్ధాంతి.. యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలో ఆయుష్య హోమాలు కూడా నిర్వహించారు. అయితే ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికి కంటే ముందు ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా చాలా గుర్తింపు పొందారు.
ములుగు సిద్ధాంతి మృతి చెందడంపై.. ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు మలక్‌పేట రేస్ కోర్సు సమీపంలోని హిందూ స్మశాన వాటికలో జరగనున్నాయి.
Also Read: Mahabharat: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
Also Read: Suryanar Temple: అనారోగ్యం, శని ప్రభావం నుంచి విముక్తి పొందాలంటే ఈ ఆలయానికి వెళ్లాలట..
Also Read: NAKSHATRA / STAR : ఈ నక్షత్రంలో పుడితే మామూలు శాంతి కాదు బాబోయ్...నక్షత్ర దోషాలు Part-3
Also Read: NAKSHATRA / STAR : పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
Also Read: NAKSHATRA / STAR : పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
Also Read: Makar Sankranti 2022: నదీ స్నానం ఇలా చేస్తే సంతాన సమస్యలు.. ఈ మూడు రకాల పాపాలు మీరు చేయొద్దు!
Also Read: Makar Sankranti 2022: ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు … మరి దక్షిణాయణం ఏంటి…!