హుజూరాబాద్ ఉపఎన్నికలో భాగంగా ఎన్ని అక్రమాలు జరిగినా.. మీడియాలో స్వేచ్ఛగా ప్రజలకు చూపించలేకపోయారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రజా స్వామ్యాన్ని నమ్ముకోలేదని.. డబ్బు సంచులు, అక్రమాలు, అన్యాయాన్ని నమ్ముకున్నారన్నారు. ఎక్కడ ఉన్నా.. ఉప ఎన్నిక కోసం ఉత్కంఠగా ఎదురు చూశారని చెప్పారు. ఉప ఎన్నికలో కుల ఆయుధం కూడా ఉపయోగించారని ఆరోపించారు. రకరకాల పథకాలతో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని.. 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇష్టారీతిన డబ్బులు ఖర్చు చేశారన్నారు.
'శ్మశానంలో డబ్బులు పంచుతున్నా అధికారులు పట్టించుకోలేదు. పోలీసులు దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారు. స్వేచ్ఛను హరించే సంస్కృతి మంచిది కాదు. కేసీఆర్ చెంప చెళ్లుమనిపించే తీర్పు హుజూరాబాద్ గడ్డ ఇచ్చింది. మీ నోట్లో నాలుకలాగా ఉంటా. పార్టీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా. ఉద్యమ బిడ్డగానే ఎప్పటికీ కొనసాగుతా. రేపటి నుంచి ఐదు అంశాలపై నా పోరాటం కొనసాగుతోంది. దళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మిగిలిన కులాలకు కూడా దళితబంధు మాదిరిగా ఆర్థిక సాయం చేయాలి. డబుల్ బెడ్ ఇళ్ల హామీని నెరవేర్చాలి. స్థలాలు ఉన్నవారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇవ్వాలి. తెలంగాణ నినాదం.. నీళ్లు, నిధులు, నియామకాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ప్రకటించిన విధంగా నెలకు రూ.3,016 లు ఇవ్వాలి, 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి, రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి’ అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఇలాంటి విష సంస్కృతి ఎన్నిక మళ్ళీ రావొద్దని కోరుకుంటున్నాని ఈటల అన్నారు. బీజేపీ నేతలు వివేక్, తేందర్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, విజయశాంతి, తుల ఉమ, బొడిగే శోభ అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. స్వేచ్ఛను హరించే సంస్కృతి మంచిది కాదని చెప్పారు. కేసీఆర్ చెంప చెల్లుమనిపించే తీర్పు.. హుజూరాబాద్ గడ్డ ఇచ్చిందన్నారు. దళిత ప్రజానీకం కుల మాత ప్రాంతలకతీతంగా అండగా నిలిచారన్నారు.
Also Read: Huzurabad Bypoll Result: గెలుపు బావుటా ఎగరేసిన ఈటల.. ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం
Also Read: Huzurabad Bypoll: అక్కడ పాయే.. ఇక్కడ పాయే.. గెల్లన్నకు ఝలక్ ఇచ్చిన ఆ రెండు గ్రామాలు