రౌండు రౌండుకు ఉత్కంఠ రేపింది. హూజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల కౌంటింగ్. మెుదటి నుంచి.. ఆధిక్యంలోనే ఉన్నారు. ఈటల రాజేందర్. అయితే మధ్యలో ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు ఆధిక్య రావడంతో.. అసలేం జరుగుతుందోనని ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత.. మిగిలన రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. రౌండు రౌండుకు ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లారు మాజీ మంత్రి. 


గెల్లు శ్రీనివాస్‌ స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో ఓటర్లు ఆయనకు ఝలక్ ఇచ్చారు.  ఆ ఊరిలో గెల్లు శ్రీనుకు 358 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్‌కి 549 ఓట్లు పోలయ్యాయి. గెల్లు అత్తగారి గ్రామం హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లె. ఇక్కడ ఓటర్లు కూడా.. ఆయనకు షాక్ ఇచ్చారు. ఇక్కడ గెల్లు శ్రీనివాస్ కంటే.. ఈటలకు 76 ఓట్ల ఆధిక్యం వచ్చింది. యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్న కటరావుపల్లెతో పాటు సీఎం కేసీఆర్‌ దళితబంధు ప్రకటించిన శాలపల్లిలో కూడా ఓటర్లు టీఆర్ఎస్ ను ఆదరించలేదు. అంతేకాదు.. కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ సొంతగ్రామం.. సింగాపూర్‌లోనూ ఇదే పరిస్థితి.


మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. దాదాపు అన్ని రౌండ్లలోనూ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఈటల విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఈటల తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23, 865ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈటల గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 


రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై పలుసార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే, అక్రమ భూముల వ్యవహారం తెర మీదకు వచ్చింది. కేసుల దర్యాప్తుపై హడావుడి జరిగింది. మంత్రి పదవి నుంచి ఈటల బర్తరఫ్.. చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల బీజేపీలో చేరి బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. కొంతకాలం ఆయన సొంత పార్టీ పెడతారనే ప్రచారమూ జరిగింది. బీజేపీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ గెలుపొందారు.


Also Read: Huzurabad Bypoll Result: గెలుపు బావుటా ఎగరేసిన ఈటల.. ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం


Also Read: Huzurabad election results: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్


Also Read: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణ బాధ్యత నాదే: రేవంత్ రెడ్డి