Breaking News Telugu Live Updates: భైంసాలో జలవిలయం, ఇళ్లను ముంచెత్తిన వరద

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 09 Jul 2022 04:17 PM
భైంసాలో జలవిలయం, ఇళ్లను ముంచెత్తిన వరద 

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణాన్ని వరద నీరు చుట్టుముట్టంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరుకుంటుంది. గడ్డెన్న వాగు పొంగడంతో నీరు భైంసా పట్టణంలోకి చేరుతోంది.  పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. 

మలేషియా మాస్టర్స్‌లో సెమీస్‌కు ప్రణయ్

భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో 14వ ర్యాంకర్ కంటా సునేమయాపై ప్రణయ్ 25-23, 22-20తో గెలుపొందారు.

CI Suspend: హైదరాబాద్:  మారేడ్ పల్లి సిఐ నాగేశ్వరరావు సస్పెండ్

హైదరాబాద్:  మారేడ్ పల్లి సిఐ నాగేశ్వరరావు సస్పెండ్
వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు, సీఐపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ సిఐ బాగోతం
ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వనస్తలి పురం లాడ్జిలో మహిళ భర్తకు అడ్డంగా దొరికిపోయిన మారేడ్ పల్లి సిఐ నాగేశ్వరరావు
ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సి ఐ గా డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ
 వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో అడ్డంగా బుక్కైన సిఐ 
రాత్రి ఆ సీఐని అదుపులోకి తీసుకున్న వనస్థలిపురం పోలీసులు 
మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన  పోలీసులు
సదరు సిఐ పై అత్యాచారం అత్యాయత్నం ఆర్మ్స్ యాక్ట్  కింద నమోదు 
 సీఐని రిమాండ్ చేయనున్న వనస్థలిపురం పోలీసులు

ఆ అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడూ, సంతాప దినాలు పాటించిన భారత్

ఇరాన్‌కు తొలి సుప్రీమ్‌ లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన సయ్యిద్ రుహొల్లా ముసవి కొమినేని అలియాస్ అయతొల్ల కొమినేని మృతి చెందినప్పుడూ భారత్‌ సంతాప దినం ప్రకటించింది. 1979 నుంచి 1989 వరకూ అధికారంలో ఉన్నారు కొమినేని. 1989లో జూన్‌3 వ తేదీన కన్నుమూశారు. ఆ తరవాత పోప్‌ జాన్‌ పాల్-2 కూడా ఈ జాబితాలో ఉన్నారు. క్యాథలిక్ చర్చ్‌ హెడ్‌గా, వాటికన్‌ సిటీ అధిపతిగా ఉన్న జాన్‌పాప్ పోల్-2,2005లో ఏప్రిల్ 2వ తేదీన మృతి చెందారు. అప్పుడు ఏకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది భారత ప్రభుత్వం. దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడిగా, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడిగా చిరస్థాయిలో నిలిచిపోయే నెల్సన్ మండేలానూ ఇదే విధంగా గౌరవించింది భారత్. 2013లో జొహెన్నస్‌బర్గ్‌లో తుది శ్వాస విడిచారు మండేలా. ఆ సమయంలో భారత్‌లో 5 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. 




 


పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం ఘరానా మోసం, బంగారం తాకట్టుతో సొమ్ము కాజేశాడు

తూర్పు గోదావరి... తాళ్లరేవు కేశవపురం పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం ఘరానా మోసం 
పోస్ట్ ఆఫీస్ కు తాళాలు వేసి, లక్షల రూపాయలతో ఉడాయించిన పోస్ట్ మాస్టర్ 
కేశవపురం పోస్ట్ ఆఫీస్ వద్ద బాధితులు ఆందోళన
ఖాతాదారులకు న్యాయం చెయ్యాలని, ఉన్నతాధికారులు వచ్చి బాధితుల సమస్యను పరిష్కరించాలని నిరసన
పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం పై చర్యలు తీసుకోవాలని నినాదాలు 
గత మూడు సంవత్సరాలుగా కేశవపురం పోస్ట్ ఆఫీస్ లో పోస్టు మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం 
బాధితులు కొంత మంది వద్ద బంగారం తాకట్టు పెట్టుకొని సొమ్ములు కాజేసిన పోస్ట్ మాస్టర్ 

Vikakha Accident: యాక్టివాను ఢీకొన్న లారీ - ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు

విశాఖ జిల్లా : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోండా యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ గురుద్వారా నుంచి అక్కయ్యపాలెం వెళ్లే రహదారి మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన మహిళల్ని స్థానికుల సహాయంతో విశాఖ ఎన్నారై హాస్పిటల్ కు పోలీసులు తరలించారు.

Prakasam Barrage Water Flow: ప్ర‌కాశం బ్యారేజ్‌కు చేరుతున్న వ‌ర‌ద నీరు, గేట్లు ఎత్తిన అధికారులు

కృష్ణ‌మ్మ నిండుకుండ‌ను త‌ల‌పిస్తోంది. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఉప‌న‌దులు, వాగుల నుంచి నీరు ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద కృష్ణాన‌దిలోకి భారీగా చేరింది. సుమారు 15 వేల క్యూసెక్కుల నీరు చేర‌డంతో అధికారులు గేట్ల‌ను ఎత్తి నీటిని కింద‌కు వ‌దిలారు. కాగా గంపలగూడెం మండలం వినగడప- తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో  విజయవాడ, నూజివీడుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాక‌పోక‌లు నిలిచిపోయాయి. 20 గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఎటువంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.

Notice To Paritala Sriram: పరిటాల శ్రీరామ్ కు నోటీసులు జారీ

అనంతపురంలో పరిటాల శ్రీరామ్ కు నోటీసులు జారీ .ఇంటినుంచి బయటకు రాకుండా పోలీసుల పికెటింగ్ 
ప్రజాస్వామ్య పద్ధతిలో రైతు సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకు రాకుండా నియంత పాలన కొనసాగుతుందని మండి పడుతున్న శ్రీరామ్ 
పరిటాల  నిరసన పిలుపు నేపథ్యంలో పోలీసుల హై అలెర్ట్ 
భారీగా రైతులు తరలి రానున్న నేపథ్యంలో, నోటీసులతో నిరసన భగ్నం చేస్తున్న పోలీసులు

Karimnagar Road Accident: కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన చిన్నారి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన జంపయ్య.. రాజేశ్వరి దంపతులు తిమ్మాపూర్ రాజీవ్ రహదారి పక్కనే వున్న ఇంటిలో అద్దెకు కు ఉంటున్నారు ..అక్కడే రాజేశ్వరి టిఫిన్ సెంటర్ లో పని చేస్తున్నది. ఆమె కూతురు శివాని గుండ్లపల్లి లో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంది. అయితే తన తల్లి ని కలవడానికి బయటికి వచ్చినా శివానిని రహదారిపై అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వచ్చిన సంతోష్ అనే వ్యక్తి   ఢీకొట్టాడు. దీంతో పాపం ఆ బాలిక 30 మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది. తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది .అయితే అప్పటికే మద్యం సేవించి ఉన్న కారులోని ముగ్గురూ ఇంత జరిగినా మళ్లీ సమీపంలోని వైన్స్ వద్దకు వెళ్లి మద్యం తాగి పారిపోయినట్లు గా స్థానికులకు ఆధారాలు లభించాయి.

Background

భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ పవిత్ర క్షేత్రానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం వరద బీభత్సం సృష్టించింది. ఈ విషాదంలో 15 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 35 నుంచి 40 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. సహాయక చర్యలు శనివారం ఉదయం సైతం కొనసాగుతున్నాయి. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు బుధవారం తిరిగి ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలో మరోసారి వరద బీభత్సం చేసి అపార ప్రాణ నష్టం కలిగించింది. ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహయ చర్యలు కొనసాగిస్తున్నాయి. వరద నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు.


టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. అగ్రిమెంట్ లో చెప్పిన దానికంటే భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయంటూ కొంతకాలంగా ఎలన్ మస్క్ వరుస ఆరోపణలు చేశారు. తాజాగా ట్విట్టర్ సంస్థ కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు మస్క్. నకిలీ అకౌంట్ల 5 శాతం కంటే తక్కువ ఉన్నాయని ట్విట్టర్ చెబుతున్నా... అది తప్పని మస్క్ వాదిస్తూ వచ్చారు. ట్విట్టర్ డీల్ ను హోల్డ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు మస్క్. అయితే ఇప్పుడు కంప్లీట్ గా డీల్ నుంచి బయటికి వస్తున్నట్లు ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. 


ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలోనూ భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం.


ఉత్తర కోస్తాంధ్ర నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాంలోనూ నేటి నుంచి   నేటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటు రాయలసీమలోని కర్నూలు జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది.


నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 


భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్స్ 14వ ర్యాంకర్ కంటా సునేమయాపై ప్రణయ్ 25-23, 22-20తో గెలుపొందారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.