Team India's T20 World Cup 2024 Victory Parade : కోట్ల మంది అభిమానుల ఆశలను నెరవేరుస్తూ..13 ఏళ్ల సుదీర్ఘకు నిరీక్షణ దించుతూ ముంబైలో కాలుమోపిన భారత ఆటగాళ్లకు... అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఓపెన్ టాప్ లెస్ బస్‌పై ప్రయాణిస్తున్న క్రికెటర్లకు నారీమన్ పాయింట్ నుంచి ముంబై వాంఖడే స్టేడియం వరకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ బస్‌పై లక్షలాది మంది అభిమానులకు అభివాదం చేస్తూ స్టార్ క్రికెటర్లు సందడి చేశారు
. ఓ వైపు సముద్రం.. మరోవైపు లక్షలాది అభిమానుల సంద్రం మధ్య ఓపెన్ టాప్ బస్‌లో ఆటగాళ్లు వాంఖడే మైదానం వైపు నడిచారు. ఆకాశమంత విజయం సాధించిన ఆటగాళ్లకు అభిమానులు సుస్వాగతం పలికారు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్లు కట్టారు. అభిమాన ఆటగాళ్ల కటౌట్‌లతో ర్యాలీ ఆసాంతం వెంట నడిచారు. ఓపెన్ టాప్ బస్‌పై ఆటగాళ్లు త్రివర్ణ పతాకాలు చేతబూనారు. టీ 20 ప్రపంచకప్ ట్రోఫీని ప్రదర్శిస్తూ.. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు..