Manchu Lakshmi: ప్లీజ్ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Manchu Lakshmi Seeks Need Urgent Help: నటి, నిర్మాత మంచు సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. సాయం చేయండి అంటూ నెటిజన్లను రిక్వెస్ట్ చేసింది.
ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సాయం కావాలని కోరుతూ పోస్ట్ పెట్టింది. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. మంచు లక్ష్మి అమెరికాలో వెళ్లేందుకు నిర్ణయించుకుంది.
తన కూతురు చదువు నేపథ్యంలో ఆమె అమెరికా వెళ్లాల్సి ఉందట. అయితే వీసా అప్రూవ్ అయినా ఇంత వరకు తనకు చేరలేదని పేర్కొంది.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. సాయం కోసం ఎదురు చూసి నిరాశ చెందాను. నెల క్రితమే నా వీసాను అమోదించారు. కానీ ఇప్పటి వరకు అది నాకు చేరలేదు.
నా కూతురు సెలవులు ముగిశాయి. జూలై 12న నేను విమానం ఎక్సాల్సి ఉంది. ఎంబసీ వెబ్‌సైట్ డౌన్ కావడంతోవారిని సంప్రదించడానికి వీలు లేకుండా పోయింది.
ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఈ విషయంలో నాకు ఎవరైనా సాయం చేయగలరా? (Desperate for help! My visa was approved over a month ago, but I still haven’t received it. My daughter’s school holidays are ending, and my flight is on July 12th. With Embassy’s website down, I’m left with no way to contact them. It’s been over two months now. Please, can someone assist?) అంటూ మంచు లక్ష్మి నెటిజన్లను అభ్యర్థించింది.
ఈ సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్ గార్సెట్టిని తన పోస్ట్‌కి ట్యాగ్ చేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్ట్ వైరల్‌గ మారింది.