Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు షాకిచ్చిన అభిమాని - ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి..!
Rakul Prret Singh: రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొన్నటి వరకు తెలుగు వరస సినిమాలతో బిజీ బిజీగా కనిపించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకానీ, ఈ మధ్య టాలీవుడ్ ఈ భామ సందడి కరువైంది. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్.. ప్రస్తుతం ఇండియన్ 2 మూవీతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.
ఈ సందర్భంగా రకుల్‌కు ఓ ఫ్యాన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి ఎప్పుడు అంటూ ఓ అభిమాని ఆమె ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రకుల్‌తో పాటు నెటిజన్లు సైతం కంగతిన్నారు.
కానీ, రకుల్ తెలివిగా సదరు నెటిజన్‌గా తనదై స్టైల్లో సమాధానం ఇచ్చింది. ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి సదరు నెటిజన్‌కు సరదాగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కామెంట్స్ వైరల్ అవుతుంది.
ఇక పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నించిన సదరు అభిమాని ప్రశ్నకు షాకైనా అది బయటపెట్టకుండా ఫన్నీగా స్పందించడం ఆకట్టుకుంది. అంతేకాదు తన పెళ్లి ఫోటోను కూడా షేర్ చేసి అతడికి క్లారిటీ ఇచ్చింది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ రకుల్ పెళ్లాడింది. గోవాలో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. ఈ పెళ్లికి కొద్దిమంది బాలీవుడ్ ప్రముఖులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.