KCR National Party Live Updates: భారత్ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్, కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్

తెలంగాణ ముఖ్యమంత్రి KCR నేడు మధ్యాహ్నం ప్రకటించబోయే జాతీయ పార్టీకి సంబంధించిన సమాచారం లైవ్ అప్ డేట్స్ ఇక్కడ పొందొచ్చు. తాజా సమాచారం కోసం ఈ బ్లాగ్ ని రీఫ్రెష్ చేస్తుండండి.

Venkatesh Kandepu Last Updated: 05 Oct 2022 05:02 PM
సీఎం కేసీఆర్ కాసేపట్లో ప్రెస్ మీట్

రాజ‌కీయ చ‌రిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి భార‌త్ రాష్ట్ర స‌మితిగా మారింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రక‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ఈ కీలక ప్రక‌ట‌న చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ స‌ర్వస‌భ్య స‌మావేశం ఆమోదించింది.  సీఎం కేసీఆర్ కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌ పార్టీ, జనరల్ బాడీ ఆమోదం

బీఆర్‌ఎస్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీ అవతరించింది. జాతీయ పార్టీ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం. పార్టీ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ ఈ కీలక నిర్ణయంపై మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం చేశారు.

TRS Changes as BRS: భారత్ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్, సాయంత్రం 4 గం.కు కేసీఆర్ ప్రెస్ మీట్

రాజ‌కీయ చ‌రిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి భార‌త్ రాష్ట్ర స‌మితిగా మారింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రక‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ఈ కీలక ప్రక‌ట‌న చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ స‌ర్వస‌భ్య స‌మావేశం ఆమోదించింది. నేడు సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

CM KCR: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం మొదలు

బేగంపేటలోని గ్రీన్ లాండ్స్ రోడ్డులో ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్, బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన చేరుకోగా, టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం అయింది. 

Telangana Bhavan: టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ

  • TRS కార్యవర్గ సమావేశానికి మీడియాను రానివ్వని తెలంగాణ భవన్ స్టాఫ్

  • మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉంటే చెప్తామంటున్న భవన్ సిబ్బంది

  • అప్పటికే టీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న మీడియాను బయటికి పంపిన పోలీస్ లు, టీఆర్ఎస్ నేతలు

  • సీఎం కేసీఆర్ ఆదేశాలతో బయటికి పంపామని అంటున్న టీఆర్ఎస్ నేతలు

  • దీంతో తెలంగాణ భవన్ బయట రోడ్డు పైకి మీడియా

BRS News: బీఆర్ఎస్ పార్టీలో విలీనానికి సిద్ధంగా మూడు పార్టీలు!

తమ పార్టీలను బీఆర్‌ఎస్‌ విలీనం చేసేందుకు కొందరు ఇతర రాష్ట్రాల నేతలు ముందుకు వచ్చారు. తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీని దాని వ్యవస్థాపకుడు తిరుమలవలవన్ బీఆర్ఎస్ లో విలీనం చేయనున్నారు. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా బీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

KCR National Party Live Updates: ప్రగతి భవన్‌లో ముఖ్య అతిథులకు అల్పాహార విందు

టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యేందుకు కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధుల బృందం ప్రగతి భవన్ కు వచ్చింది.


 తమిళ నాడు నుంచి  ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (విసికె) పార్టీ అధినేత ‘చిదంబరం పార్లమెంట్ సభ్యుడు’, ప్రముఖ దళిత నేత  తిరుమావళవన్, వారితో పాటు వచ్చిన ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్నది. ప్రగతి భవన్ వచ్చిన కుమారస్వామి బృందాన్ని, తిరుమావళవన్ బృందాన్ని సీఎం కెసిఆర్, కేటీఆర్ లు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్., టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు., ఎమ్మెల్సీలు., తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Munugode: బీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికలకు?

నేడు కొత్తగా ప్రకటించబోతున్న జాతీయ పార్టీ పేరుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నేడు జాతీయ పార్టీ ప్రకటనతోపాటు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తారని అంటున్నారు. మునుగోడులో గెలిచిన జాతీయ పార్టీగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. నామినేషన్ వేసే నాటికి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

Munugode: బీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికలకు?

నేడు కొత్తగా ప్రకటించబోతున్న జాతీయ పార్టీ పేరుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నేడు జాతీయ పార్టీ ప్రకటనతోపాటు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తారని అంటున్నారు. మునుగోడులో గెలిచిన జాతీయ పార్టీగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. నామినేషన్ వేసే నాటికి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

KCR Press Meet: మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం

జాతీయ పార్టీ ప్రకటన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.  

Background

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తాను నేడు (అక్టోబరు 5) ప్రకటించనున్న జాతీయ పార్టీ పేరును ఫైనల్ చేశారు. మొత్తానికి జాతీయ పార్టీకి కొత్త పేరు కోసం ఆయన దాదాపు 100 పేర్లకు పైగా పరిశీలించినట్లు సమాచారం. చివరకు ‘భారత్ రాష్ట్ర సమితి’ అనే పేరును ఫిక్స్ చేశారు. మంగళవారం రాత్రి కీలక పరిణామం జరిగింది. భారత్‌ రాష్ట్ర సమితి అనే పేరు తెలుగు వారితో పాటు హిందీలోనూ అర్థం అయ్యేలా సులభంగా ఉండడం వల్ల ఆ పేరు వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. జాతీయ పార్టీ పెడతారని ఊహాగానాలు మొదలైనప్పటి నుంచి జాతీయ మీడియాలోనూ ఇదే పేరు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. 


నేడు (అక్టోబరు 5) తెలంగాణ భవన్‌లో జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ పేరు మార్పుపై అధ్యక్షుడు కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దానికి పార్టీలో ఉన్న 283 మంది సభ్యులు ఏకగ్రీవ  ఆమోదం తెలుపుతారు. ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం.. మధ్యాహ్నం 1.19 గంటలకు సదరు ఏకగ్రీవమైన తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేయనున్నారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి తాము ఆమోదించిన తీర్మానం గురించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది.


ఈ తీర్మానం ప్రతిపాదన, ఆమోదం, ఎవరెవరు ప్రసంగించాలనే అంశాలను నిర్ణయించేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు (కేకే), ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


హైదరాబాద్ కు చేరుకున్న నేతలు
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌ హాజరు కానున్నారు. వీరు నిన్న రాత్రే హైదరాబాద్ కు చేరుకున్నారు. జేడీఎస్ ప్రతినిధి బృందానికి బేగంపేట ఎయిర్ పోర్టులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్వాగతం పలికారు.


అక్టోబరు 6న ఢిల్లీకి
భారత్‌ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్పు నిర్ణయంపై చేసిన తీర్మానం ప్రతితో వినోద్‌కుమార్‌ సహా ఇతర కీలక నేతలు 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ పేరు మార్పుపై చేసిన తీర్మానానికి ఆమోదం కోరుతూ అఫిడవిట్‌ ఇస్తారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు 30 రోజుల టైం ఇస్తుంది. ఏవీ రాకపోతే దాన్ని ఆమోదించేస్తుంది.


విజయదశమి రోజున మధ్యాహ్నం 1.19 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి సహా ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్నారు.  తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీగా పేరున్న విడుదలై చిరుత్తయిగల్‌ కచ్చి పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్యే బాల్కా సుమన్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. మరో మూడు పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కొన్ని పార్టీలు బీఆర్ఎస్ లో విలీనమవుతాయని నేతలు అంటున్నారు. జాతీయ పార్టీ ప్రకటన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.