కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఆగస్టు 19 నుండి 21 వరకు కోదాడ నుంచి హైదరాబాద్ వరకు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ లో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రికి కిషన్ రెడ్డి సూర్యాపేటలో బస చేస్తారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. 


Also Read: Nityananda: ఆ పీఠంపై కన్నేసిన నిత్యానంద.. ఒక్క ప్రకటనతో దుమారం.. వెంటనే తాళాలు వేసి, గదులు సీజ్


చింతకింది మల్లేష్ కుటుంబానికి పరామర్శ


20వ తేదీన యాత్ర దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్, ఖిల్లాషాపూర్  లో పాపన్న గ్రామం మీదుగా జనగామ, ఆలేరు, యాదగిరిగుట్ట చేరుకుంటుంది. వరంగల్ లో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించనున్నారు.  ఆలేరులో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం యాదగిరిగుట్టలో ఆ రాత్రి బస చేస్తారు.


Also Read: BJYM Protest: తెలంగాణ మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్న BJYM కార్యకర్తలు


 

324 కిలోమీటర్లు యాత్ర


21వ తేదీ ఉదయం భువనగిరిలో కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం విధానాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఘట్కేసర్, ఉప్పల్, సికింద్రాబాద్, మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి 7 గంటలకు సభ నిర్వహిస్తారు. 12 జిల్లాలు, 7 పార్లమెంట్ నియోజకవర్గాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా మొత్తం 324 కిలోమీటర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను తెలంగాణ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. 


 


Also Read: BRAOU Admissions: అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు..


                  Jagitial: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్న స్వామీజీ.. శవం దగ్గర మంత్రాలు, పూజలు.. చివరికి ఏమైందంటే..!