BJYM Protest: తెలంగాణ మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్న BJYM కార్యకర్తలు
తెలంగాణ మంత్రులకు ఉద్యోగ నోటిఫికేషన్ సెగ తగిలింది. సైదాబాద్ లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కాన్వాయ్ లను BJYM కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్నారు. కాన్వాయ్ పైకి ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి మంత్రులను అక్కడి నుంచి పంపించేశారు.