Case On Mallu Ravi :   సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని  నమోదు చేసిన కేసులో సీనియర్ నేత మల్లు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు నిందితునిగా చేర్చారు. ఈ కేసు విషయంలోనే మాదాపూర్ లో ఉన్న స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఆఫీసులో  సోదాలు సోదాలు చేశారు. ఆఫీసును సీజ్ చేశారు. అయితే అది తన కార్యాలయం కాదని..  కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ అని సునీల్ కనుగోలు స్పష్టం చేశారు. ఆ కార్యాలయానికి మల్లు రవి ఇంచార్జ్ ఇనితెలిపారు.  దీంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
పార్టీ వ్యూహకర్తగా పేరు వినిపిస్తున్న సునీల్ కనుగోలు స్టేట్‌మెంట్‌ ఆధారంగానే మల్లు రవిపై కేసు నమోదు అయ్యింది. సోమవారం రోజు సునీల్ కనుగోలును సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా  సునీల్ కనుగోలు స్టేట్ మెంట్‌ను పోలీసులు నమోదు  చేశారు. కాంగ్రెస్ వార్ రూంతో తన కు సంబంధం లేదని సునీల్ తన స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌కు వ్యూహాలు మాత్రమే చెప్తానని.. వార్ రూం ఇంఛార్జి మల్లు రవి.. అని  ఆయన  చెప్పింది మాత్రమే మా టీం చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు మల్లురవిని నిందితునిగా చేర్చారు.  


సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో.. గతేడాది నవంబర్‌ 24వ తేదీన మాదాపూర్‌లోని సునీల్‌ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. అయితే.. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు . ఆ సమయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు.  ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్‌ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు  పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో  మల్లు రవిని కూడా నిందితునిగా చేర్చారు. 


ఈ కేసులో సీఆర్‌పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేశారు. ఈనెల 12వ తేదీన గురువారం విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలపై విచారణ చేసేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇన్‌ఛార్జి అయిన మల్లు రవికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నా.. కేసు నమోదు కావడంతో తర్వాతి పరిణామం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. అయితే అసలు సైబర్ క్రైమ్ కేసే అక్రమం అని.. ఆ కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 


లక్కీ డ్రా పేరుతో డబ్బులు వసూలు, మంత్రి అంబటిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు!