చలికాలంలో జలుబు, దగ్గు ఎలాగో కీళ్ల నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. వృద్ధులు, అథ్లెట్లు, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఈ సమయంలో ఎక్కువ ప్రభావితం అవుతారు. అయితే కొంతమందికి శీతాకాలంలో మాత్రమే కీళ్ల నొప్పులు వస్తాయి. వాటిని భరించడం కష్టమవుతుంది. ఈ నొప్పులు ఎక్కువగా వాతావరణంలో మార్పు వల్ల వస్తుంది. కేవలం శీతాకాలంలో మాత్రమే నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా?
కీళ్ల నొప్పులకు కారణాలు
తక్కువ ఉష్ణోగ్రత కండరాల నొప్పులకు దారితీస్తుంది. దాని వల్ల కండరాల ధృడత్వం తగ్గిపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. సూర్యరశ్మి తగలకపోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందదు. ఫలితంగా ఎముకలు, కీళ్ళు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బయట చల్లగా ఉన్నప్పుడు కీళ్ల నొప్పులు పెరగడానికి మరొక కారణం కాళ్ళు, వేళ్ళకి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని వల్ల కూడా నొప్పులుగా అనిపిస్తాయి. కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించడం ఉత్తమం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే శరీరానికి తగిన శ్రమ ఉండాలి. అందుకోసం రెగ్యులర్ గా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీర భాగాలని కదిలిస్తుంది. చలిలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే నొప్పుని దూరం చేస్తుంది. అయితే నొప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం కఠినమైన వ్యాయామాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోండి
శీతాకాలంలో చలి నుంచి బయటపడాలంటే శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఉంటే ఉష్ణోగ్రత తగ్గించుకుని వేడిగా ఉండేందుకు హీటర్లని ఉపయోగించుకోవచ్చు. బయటకి వెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు ధరించి చేతులకు తొడుగులు, తలకి స్కార్ఫ్ తో వెళ్ళాలి.
ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి
శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. శీతాకాలంలో కీళ్ల నొప్పులని నివారించడానికి సాల్మన్, వాల్ నట్స్, అవిసె గింజలు, అవకాడో తీసుకోవాలి. వీటిలో ఒమేగా ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి.
హైడ్రేట్ గా ఉండాలి
చలికాలంలో మంచి నీళ్ళు తాగడానికి ఎక్కువగా ఇష్టపడరు. చల్లగా ఉండటం వల్ల పదే పదే మూత్రవిసర్జనకి వెళ్లాలసి వస్తుందని వాటిని దూరం పెడతారు. కానీ శరీరానికి ఎప్పటిలాగానే నీరు చాలా అవసరం తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ కి గురవుతారు. ఇది నొప్పి, అలసటని మరింత పెంచుతుంది. చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని ఎంపిక చేసుకుని తాగొచ్చు. లేదంటే స్మూతీస్ తీసుకోవచ్చు. వేడి వేడి సూప్ ద్వారా తీసుకోవడం వల్ల కూడా శరీరానికి కావలసిన ద్రవం అందుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ నీళ్ళు తాగొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: అమ్మాయిలూ వాలుజడ కావాలా? ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో చేర్చుకోండి