వాతావరణం ఏదైనా అది జుట్టు మీద చెడు ప్రభావం ఎక్కువగా చూపుతుంది. ఖరీదైన షాంపూలు, కండిషనర్ లు ఉపయోగించడం వల్ల జుట్టుకి తాత్కాలిక పోషణ లభిస్తుంది. అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. అయితే ఈ ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పొడవు పెరుగుతాయి. జుట్టు ఆరోగ్యాన్ని నిర్ణయించేది ప్రోటీన్స్ అని నమ్ముతారు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, కొవ్వులో కరిగే విటమిన్లు, ఐరన్, బి కాంప్లెక్స్ జుట్టుకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి పుష్కలంగా లభించే కూరగాయలు, పండ్ల జాబితా ఇది. వీటిని తినడం వల్ల జుట్టుకి సంబంధించిన సమస్యలన్నీ ఎదుర్కోవచ్చు.


గుమ్మడికాయ


ఇందులో ఐరన్, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. జుట్టు పెరుగుదల, బలానికి అవసరమైన విటమిన్ ఏ అందిస్తుంది. శరీర కణాలని దెబ్బతినకుండా రిపేర్ చేసేందుకు సహాయపడి విటమిన్ సి, ఇ లభిస్తుంది.


ఆకుపచ్చని కూరగాయలు


ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి, కెరోటిన్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు కుదుళ్ళని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్ గా ఉంచే సెబమ్ ఉత్పత్తిని చేయడానికి సహాయపడుతుంది.


క్యారెట్లు


విటమిన్ ఏ సమృద్ధిగా అందిస్తుంది క్యారెట్. ఇది జుట్టుకి అనేక ప్రయోజనాల్ని ఇస్తుంది. శరీర కణాల పెరుగుదలకి విటమిన్ ఏ అవసరం. జుట్టు వేగంగా పెరగడానికి సరైన ఆహారంగా నిపుణులు పేర్కొంటున్నారు.


చిలగడదుంపలు


స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీర వినియోగం కోసం విటమిన్ ఏ గా మారుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెబమ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.


బెల్ పెప్పర్స్


ఎరుపు, పసుపు రంగుల్లో దొరికే బెల్ పెప్పర్స్ లో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు కుదుళ్ళని బలపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పని చేసి జుట్టు క్యూటికల్స్ ని కాపాడుతుంది.


అవకాడో


ఆరోగ్యకరమైన పండ్లలో ఇది ఒకటి. ఆరోగ్యకరమైన కొవ్వులు, బయోటిన్ తో నిండి ఉంటుంది. హెయిర్ మాస్క్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులోని విటమిన్ ఇ జుట్టుకి పోషణ ఇస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి స్కాల్ఫ్ ని రక్షిస్తుంది.


అరటిపండు


సహజ నూనెలు, విటమిన్లు, పొటాషియం సమృద్ధిగా ఉండే పండు. చిట్లిపోయిన జుట్టుకి చికిత్స చేస్తుంది. బలమైన జుట్టు పెరుగుదలని ప్రేరేపిస్తుంది. స్కాల్ఫ్ రంధ్రాలు అన్ లాగ్ చేసి చుండ్రు సమస్యని నివారిస్తుంది.


బొప్పాయి


విటమిన్లు ఏ, సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఫోలికల్స్ లో జుట్టు పెరిగేలా చేసేందుకు ఇవి దోహదపడతాయి. చుండ్రుని నివారించే యాంటీ ఫంగల్ లక్షణాలని కలిగి ఉంది. జుట్టుకి లోతైన కండిషనింగ్ అందిస్తుంది.


సిట్రస్ పండ్లు


నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ శి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుని బలోపేతం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మైక్రోవేవ్ లో నోరూరించే రుచికరమైన పప్పుని ఇలా వండేయండి!