గుప్పెడంతమనసు జనవరి 11 బుధవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 11th Update)
కాలేజీ గ్రౌండ్ లో ఒంటరిగా నిల్చున్న రిషి..వసుధారతో స్పెండ్ చేసిన సంఘటనలు అన్నీ గుర్తుచేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన జగతి రిషిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది. జగతిని చూసిన రిషి...
రిషి: మేడం మీ శిష్యరాలు మీకు కనిపిస్తే చెప్పండి..ఈ రిషీంద్ర భూషణ్ కి మోసపోవడం కొత్తకాదని... తను నాకు అక్కర్లేదని చెప్పండి...ఈ మాటలు ఈ జెంటిల్మెన్ చెప్పాడని తనకు గుర్తుచేయండి
జగతి ఏం మాట్లాడలేక రిషిని చూస్తూ నిల్చుంటుంది..
మరోవైపు రాజీవ్ ఇదే అదనుగా వసుని టార్గెట్ చేస్తాడు... హాస్పిటల్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళుతుంది వసుధార.ఆ వెనుకే వచ్చిన రాజీవ్...వసు..మీ రిషి సార్ పాపం.... ఇప్పుడు నువ్వు నా భార్యవి అనుకుంటున్నాడు కాబట్టి రిషి నీకు దూరమైనట్టే అంటాడు...
అంటే వసు మెడలో తాళి చూసిన రిషి..తాను కట్టలేదని క్లారిటీ ఇచ్చాడు..మరోవైపు వసుధార ఇష్టపూర్వకంగానే ఈ తాళి నా మెడలో పడిందని చెప్పింది..దీంతో రాజీవ్ ని పెళ్లిచేసుకుందనే ఆలోచనలో ఉన్నాడు రిషి... మరేం జరుగుతుందో చూడాలి..
Also Read: మళ్లీ మోనిత ముందు తలొంచిన కార్తీక్, సౌందర్య-దీప ఏం చేయబోతున్నారు!
మంగళవారం జరిగిన కథ
మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండిసార్ దండం పెడతాను అన్నవసుధార మాటలు గుర్తుచేసుకుంటూ బాధగా ఇంటికి వస్తాడు రిషి. శూన్యంలో నడుస్తున్నట్టు వచ్చిన రిషిని చూసి ఇంట్లో అంతా కంగారుపడతారు. దేవయాని దొంగప్రేమ నటిస్తుంది. మహేంద్ర మాట్లాడించేందుకు ప్రయత్నించినా రిషి ఏమీ చెప్పడు. జగతిని మాత్రం టార్గెట్ చేస్తాడు. మీ శిష్యురాలు నా జీవితంలోకి వచ్చేలా చేసినందుకు మీకు మనసులోనే ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను మేడం..ఇప్పడు తను జీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పించింది..ఇందుకు కూడా థ్యాంక్స్ చెప్పాలా అని అని జగతి గుండె ముక్కలయ్యేలా మాట్లాడతాడు..
Also Read: కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారిపోయిందే, అంతులేని బాధతో జగతికి థ్యాంక్స్ చెప్పిన రిషి!
మరోవైపు జైల్లో ఉన్న వసుధార..రిషిసార్ ఇక జీవితాంతం మీ జ్ఞాపకాలతో బతికేస్తా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు రాజీవ్.. దేవయానికి కాల్ చేసి బెయిల్ గురించి అడుగుతాడు. ఆల్రెడీ లాయర్ ని పంపించాను వెళ్లి చూడు అని కాల్ కట్ చేస్తుంది దేవయాని. వసుధారను బయటకు తీసకొచ్చిన లాయర్..దేవయానితో ఫోన్ మాట్లాడతాడు... అది విన్న వసుధార మాత్రం జగతి మేడం బెయిల్ ఇప్పించారని అనుకుంటుంది. ఆ తర్వాత అక్కడున్న పోలీస్..నీ భర్త రాజీవ్ చాలా మంచోడని పొగిడేసి..బుద్ధిగా కాపురం చేసుకో అని సలహా ఇస్తాడు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది వసుధార. రాజీవ్ వెంటపడుతూనే ఉంటాడు..
వసుధార జ్ఞాపకాల్లో మునిగితేలుతున్న రిషి..గతంలో వసు ఇచ్చిన నెమలీక పట్టుకుని నేలపైనే అలా నిద్రపోతాడు. పొద్దున్నే దేవయాని కాఫీ తీసుకెళ్లేందుకు సిద్ధం అవడంతో..అప్రమత్తమైన మహేంద్ర ఆ కాఫీ కప్పు తీసుకుని తను వెళతాడు. రిషి రూమ్ లో లేడేంటి అనుకుంటూ వెనక్కు తిరిగే లోగా కిందపడుకుని ఉండడం చూసి కంగారుపడతాడు. ఏమైంది నాన్నా అని రిషితో ప్రేమగా మాట్లాడతాడు..అప్పుడు రిషి..వసుధార తనను ఇంతలా బాధపెడుతుంది అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు...