కార్తీకదీపం జనవరి 11 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam January 11th Update)


ఇంట్లో మోనితను చూసి సౌందర్య అండ్ కో షాక్ అవుతారు. ఆ తర్వాత సౌందర్య..మోనితను నిలదీస్తుంది
సౌందర్య: ఎందుకే ఇలా చేశావు చెప్పు అని జుట్టు పట్టుకుట్టుంది
మోనిత: వదలండి ఆంటీ ఇప్పటికే మీ కొడుకు నా వైపు చూడడం లేదు. జుట్టు చెదిరిపోతే అస్సలు చూడడు అనడంతో దీప కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయినా ఏం జరిగిందో నీ కొడుకు కోడలు చెప్పి ఉంటారు కదా మళ్లీ నన్ను అడుగుతున్నారు ఏంటి. వాళ్లు కొంతకాలం రాకపోవడానికి నేనే కారణం. కానీ నేను జైలుకు వెళ్లిన తర్వాత మాత్రం నాకు తెలియదు. ఏటి దీప, ఏంటి కార్తీక్ నువ్వు కూడా ఇంకా చెప్పలేదా ఇన్నాళ్లు ఆంటీ వాళ్ళు కనిపించలేదు కాబట్టి చెప్పలేదంటే ఓకే ఇప్పుడు కనిపించిన తర్వాత కూడా ఎందుకు దానిని దాస్తున్నారు
నువ్వు నడువు అంటూ దీప..మోనితను బయటకు గెంటేస్తుంది. 
సౌందర్య: ఏం చెప్తుంది రా ఇది మీరు నా దగ్గర ఏం దాస్తున్నారు 
దీప: అదేం లేదు అత్తయ్య ఇది మన కుటుంబంలో గొడవలు పెట్టాలని చూస్తోంది
ఇంటికి వెళదాం పదండి అంటంది సౌందర్య...


Also Read: కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారిపోయిందే, అంతులేని బాధతో జగతికి థ్యాంక్స్ చెప్పిన రిషి!


మోనిత టీ పాయ్ పగలగొట్టడంతో చేతికి దెబ్బ తగలడంతో చారుశీల ఇంజెక్షన్ ఇస్తుంది. 
చారుశీల: ఎందుకు ఇలా చేశావు మోనిత 
మోనిత: కార్తీక్ పై నాకున్న ప్రేమ ఇలా చేసింది కానీ కార్తీక్ నన్ను అర్థం చేసుకోవడం లేదు 
చారుశీల: ఎందుకు మోనిత కార్తీక్ ని వదిలేసెయ్, ఎలాగో కార్తీక్ కి నీ మీద ప్రేమ లేదు కదా . నువ్వు ప్రేమించింది పెళ్లైన కార్తీక్ ను అడ్డు పడేందుకు దీప చాలదా...
మోనిత: దీప నాకు అడ్డుకాదు..సౌందర్య ఆంటీనే అడ్డం
చారుశీల: ఇప్పటికైనా కార్తీక్ గురించి ఆలోచించడం మానేస్తే మంచిది..కార్తీక్ పై ఆశతో నిన్ను సైడ్ చేయాలన్న ఉద్దేశంతో చెబుతున్నా అనుకోవద్దు...నీపై ఎలాంటి ఉద్దేశం లేదు..నువ్వెంత ప్రయత్నించినా ఏంలాభం
మోనిత: ఆ ఉద్దేశం మార్చడానికే ఈ ప్రయత్నం..వాళ్లకి గడువు ఇచ్చాకదా..ఈలోగా నా కార్తీక్ ను దక్కించుకుంటాను..


Also Read: అందరి ముందు బుక్కైపోయిన మోనిత, దీప-కార్తీక్ పై అనుమానపడుతున్న సౌందర్య


సౌందర్య ఇంట్లో అందరికీ వడ్డిస్తుంటుంది..ఏం జరిగిందో మీ కొడుకు, కోడలు చెప్పలేదా అన్న మోనిత మాటలు గుర్తుచేసుకుంటుంది సౌందర్య. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దీప-కార్తీక్ సైగలు చేసుకుంటూ ఉండగా సౌందర్య గమనిస్తుంది.  ఏంటో చెప్పండి ఎందుకు పరధ్యానంగా ఉంటున్నారని సౌందర్య అడిగితే కార్తీక్ మాట దాటేస్తాడు. ఈ లోగా అంజి రావడంతో దీప పలకరిస్తుంది..అప్పుడు సౌందర్య..అంజి నీక్కూడా నిజం తెలుసుకదా అని అడిగితే.. మొదట్లో తెలియదు కానీ ఆ తర్వాత తెలిసింది..మా అమ్మ పండరి కూడా అక్కడే పనిచేస్తోందని చెబుతాడు. 


మరోవైపు మోనిత జరిగిన విషయాలు తలచుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి చారుశీల వచ్చి ఏం ఆలోచిస్తున్నావు మోనిత ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అంటుంది
మోనిత: అర్థం కావడం లేదు అందరూ ఒకటయ్యారు ఇప్పేడేం చేయగలను. నిన్ను మధ్యలో ఉపయోగించుకుందాం అనుకుంటే నేను నిజం చెప్పి తప్పు చేశాను
చారుశీల: జైలు నుంచి రాగానే నిన్ను ఎవరు నిజం చెప్పమన్నారు 
మోనిత: ఏంటి కార్తీక్ ని దక్కించుకునే అవకాశం పోయింది అనుకుంటున్నావా 
చారుశీల: 12 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్న నీకే దిక్కులేదు..నాకేం ఉంటుంది. నా సంగతి పక్కన పెట్టి ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు 
మోనిత: ఇప్పటికి రెండుసార్లు కార్తీక్ నా నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు ఈసారి మాత్రం అలా జరగకూడదు 
చారుశీల: ఇవన్నీ జరగాలంటే ముందు కార్తీక్ మనసులో నీకు చోటుదక్కాలి..కానీ కార్తీక్ కి అసలు నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టంలేదు..మరి ఇదెలా సాధ్యం అవుతుందో ఆలోచించుకో...


ఆ తర్వాత కార్తీక్-దీప ఇద్దరూ మాట్లాడుకుంటారు. అమ్మా నాన్న దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావు..ఎక్కడికైనా వెళ్లిపోయేవారం కదా అని కార్తీక్ అంటే..ఎప్పుడు ఎవర్ని ఎలా కలపాలో దేవుడు రాసిపెట్టి ఉంటాడు లెండి అంటుంది. మరోవైపు సౌందర్య.. ఆలోచనలో పడుతుంది. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా మాట్లాడుకుంటేకానీ నిజం ఏంటో తెలియదు అనుకుంటూ వెళ్లి వాళ్ల మాటలు వినేందుకు ప్రయత్నిస్తుంది.  సౌందర్యని గమనించిన దీప..మాట మార్చి మాట్లాడుకుంటారు. అప్పుడు సౌందర్యకి ఏమీ అర్థంకాక ఆగిపోతుంది...సౌందర్య వింటున్న సంగతి కార్తీక్ కి సైగ చేస్తుంది.


రేపటి(గురువారం) ఎపిసోడ్ లో
ఇంద్రుడు, చంద్రమ్మ ఇంటికి రావడంతో దీప -కార్తీక్ థ్యాంక్స్ చెబుతారు... వీళ్లు ముందే తెలుసా అని సౌందర్య.. ఇంద్రుడిని నిలదీస్తుంది... మరోవైపు మోనిత..దీప చనిపోతుందని సౌందర్యకి చెప్పేస్తానంటూ కార్తీక్ ని బెదిరిస్తుంది..