దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే. ఆయన సినిమాల్లో, మాటల్లో, చేతల్లో మన సంప్రదాయం కనబడుతుంది, వినబడుతుంది, స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా ఆయన మార్క్ చూపించారు. దీనిని రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్' టీమ్ సాధించిన ఘనతగా చూడాలి. పూర్తి వివరాల్లోకి వెళితే...
 
సుమారు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు బెస్ట్ నాన్ - ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ సైతం నామినేషన్ దక్కించుకున్నారు. భారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం అవార్డు కార్యక్రమం జరుగుతుంది.


గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. వీరితో పాటు 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఉన్నారు. రెడ్ కార్పెట్ మీద 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. 


Also Read : 'తెగింపు'లో 'సర్కారు వారి పాట'? ఫస్టాఫ్‌లో అజిత్ స్క్రీన్‌ స్పేస్‌ తక్కువే కానీ - సినిమా ఎలా ఉందంటే?






దర్శకుడు ధీరుడు రాజమౌళి డ్రస్సింగ్ స్టైల్ ఇండియన్ ట్రెడిషన్ అంటే ఏమిటో వెస్ట్రన్ జనాలకు చూపించింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, రాజమౌళి సతీమణి రామ, కీరవాణి సతీమణి శ్రీవల్లి చీరకట్టులో హాజరయ్యారు. భారతీయ సంప్రదాయంలో చీరకు ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు... అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ద్వారా మన భారతీయతను అక్కడి ప్రేక్షకులకు చూపించిన ఘనత రాజమౌళి అండ్ 'ఆర్ఆర్ఆర్' యూనిట్ సభ్యులకు దక్కుతుందని చెప్పాలి. ఇది జక్కన్న మార్క్ అని చెప్పాలి.


గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో పాటు 'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ సాధించడం ఖాయం అని బాలీవుడ్ బలంగా నమ్ముతోంది. 'పఠాన్' ట్రైలర్ విడుదల సందర్భంగా షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ మధ్య జరిగిన సంభాషణ అందుకు సాక్ష్యంగా చూడొచ్చు. 


Also Read : 'వారసుడు' వాయిదా వేసినా... పవర్ చూపించిన 'దిల్' రాజు   










'పఠాన్' తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు షారుఖ్ థాంక్స్ చెప్పారు. అంతే కాదు... 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడం కన్ఫర్మ్ అని కాన్ఫిడెన్స్ చూపించారు. 


నన్ను టచ్ చేయనివ్వండి!
''మీ 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆస్కార్‌ను ఇంటికి తెచ్చినప్పుడు ఒక్కసారి దానిని నన్ను టచ్ చేయనివ్వండి. లవ్ యు'' అని షారుఖ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చూసిన 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'పఠాన్' తమిళ ట్రైలర్‌ను దళపతి విజయ్ ట్వీట్ చేశారు. ఆయనకు తమిళంలో షారుఖ్ రిప్లై ఇచ్చారు. ఆయనకు రామ్‌ చరణ్‌ థ్యాంక్స్‌ చెప్పారు. అంతే కాదు... ఆస్కార్‌ అందరిదీ అని పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డులకు కూడా 'నాటు నాటు' పోటీ పడుతోంది. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అర్హత సాధించింది. నామినేషన్ వస్తుందా? లేదా? అనేది చూడాలి.