AP Telangana Latest News Today: కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు - రేపు ఢిల్లీలో హైకమాండ్ తో చర్చలు
తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరి 10 రోజులు అవుతుంది. ఇప్పటికే 11 మంది మంత్రులు రేవంత్‌ టీం (Revanth Team )లో ఉన్నారు. ఇంకా 7 ఖాళీలు ఉన్నాయి. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ( Cabinet Expanstion )జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా హైకమాండ్‌తో చర్చించనున్నారని సమాచారం.  ఈ నెలాఖరులోపు తెలంగాణలో మంత్రి మండలి విస్తరణ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


'ప్రతీ పేదవాడికి ఖరీదైన వైద్యం' - ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలు
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. 'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' (YSR Aarogyasri) పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని (Tadepalli) తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పేద ప్రజలకు ఈ పథకం ఓ వరమని, అందుకే పరిమితి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


 'యువగళం' ముగింపు సభకు రానున్న జనసేనాని పవన్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) 'యువగళం' (Yuvagalam) ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. విజయనగరం (Vijayanagaram) జిల్లా భోగాపురం (Bhagapuram) మండలం పోలిపల్లి వద్ద ఈ నెల 20న పాదయాత్ర విజయోత్సవ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, తాను హాజరు కాలేనని తొలుత పవన్ టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హాజరవుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌- తెలంగాణ కాంగ్రెస్‌ నేతల కీలక సమావేశం
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టాక... తొలిసారి పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్  అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఈ మీటింగ్‌పై ఆసక్తి రేగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన  జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ థాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌  చౌదరి, విశ్వనాథ్‌తోపాటు పార్టీ సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు హరీష్ రావు అభినందనలు
బిగ్ బాస్ - 7 విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prasanth) కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అభినందనలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలిచినందుకు గర్వంగా ఉందన్నారు. 'పల్లవి ప్రశాంత్ అనే పేరు రైతు ఇంటిపేరుగా మారింది. ఈ సీజన్ లో సామాన్యుల ధృడత్వానికి ప్రతీకగా నిలిచింది. పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకూ అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తనదైన వైవిధ్యాన్ని ప్రదర్శించింది.' అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి