Breaking News Live Telugu Updates: వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Nov 2022 03:56 PM
వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు  

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లింగగిరి వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యేపై వైఎస్ షర్మిల వ్యాఖ్యలతో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్ షర్మిల ప్రచారం రథం, ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు. 

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 6511 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు నియమకాలకు సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 6511 పోలీస్ ఉద్యోగులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 315 ఎస్‌ఐ, 96 రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, 3,580 కానిస్టేబుల్ (సివిల్‌), 2,520 ఏపీఎస్పీ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 6,100 కానిస్టేబుల్‌, 411 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు  ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహిస్తారు. 

వైఎస్‌ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత- కార్‌వ్యాన్ తగలబెట్టిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల కార్ వ్యాన్‌ను టీఆర్‌ఎస్‌ శ్రేణులు తగలబెట్టారు. పాదయాత్ర వాహనాలపై రాళ్ళు రువ్వారు.

వైఎస్‌ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత- కార్‌వ్యాన్ తగలబెట్టిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల కార్ వ్యాన్‌ను టీఆర్‌ఎస్‌ శ్రేణులు తగలబెట్టారు. పాదయాత్ర వాహనాలపై రాళ్ళు రువ్వారు. 

వైఎస్‌ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత- కార్‌వ్యాన్ తగలబెట్టిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల కార్ వ్యాన్‌ను టీఆర్‌ఎస్‌ శ్రేణులు తగలబెట్టారు. పాదయాత్ర వాహనాలపై రాళ్ళు రువ్వారు. 

Bandi Sanjay News: బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేసుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. అందుకోసం కొన్ని షరతులు విధించింది. అయితే, యాత్ర భైంసా పట్టణం నుంచి వెళ్లకూడదని, అవసరమైతే భైంసాకు మూడు కిలో మీటర్ల దూరంలో సభ జరుపుకోవచ్చని సూచించింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని సూచించింది. శాంతి భద్రతలను పూర్తిగా పోలీసులే కాపాడాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Telangana Secretariat: కొత్త సచివాలయ ప్రారంభానికి డేట్ ఫిక్స్

తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 18న సచివాలయాన్ని ప్రారంభించేందుకు డేట్ ఫిక్స్ చేశారు. ఇంకా 50 రోజుల వరకూ సమయం ఉండడంతో అప్పటికల్లా పెండింగ్ పనులు మొత్తం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జనవరి 18 కల్లా అన్ని పనులు పూర్తి చేసి కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభించాలని ఆదేశించారు.

TRS MLAs Pouching Case: ఉస్మానియా ఆస్పత్రిలో నంద కుమార్‌కు వైద్య పరీక్షలు

  • ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్  చేరుకున్న నంద కుమార్

  • నంద కుమార్ ను కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్న పోలీస్ లు

  • నేడు, రేపు రెండు రోజుల పాటు కస్టడీ విచారణ అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు

  • ఇప్పటికే నందకుమార్ పై ఐదు చీటింగ్ కేసులు నమోదు

  • ఇటీవలే ముగ్గురు నందకుమార్ పై చీటింగ్ చేశారని ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు నందకుమార్ పై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద కేసు నమోదు

  • దీంతో మొత్తం నందకుమార్ పై ఐదు చీటింగ్ కేసుతో పాటు ఫోర్జరీ సంతకంపై నమోదు అయిన కేసులపై కస్టడీ విచారణ జరుపుతున్న పోలీసులు

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి విద్యార్థుల నిరసన సెగ

వికారాబాద్ శ్రీ అనంత పద్మనాభ కళాశాల విద్యార్థుల నిరసన సెగ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై పడింది. ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్ షిప్‌లను ఫీజు రిఎంబర్స్‌మెంట్ ను వెంటనే విడుదల చేయించాలని కోరారు.హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని విద్యార్థులు అడ్డుకొని నిరసన తెలిపారు.

KCR Tour in Nalgonda: కేసీఆర్ నల్లగొండ జిల్లా దామరచర్లలో పర్యటన

  • రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా దామరచర్లలో పర్యటన

  • అక్కడ జరుగుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

  • ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్

  • బేగంపేట నుంచి హెలికాప్టర్ లో  మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల

  • అక్కడి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలన

  • అనంతరం అక్కడ సమీక్ష సమావేశం

  • సాయంత్రం సీఎం హెలికాప్టర్లో హైదరాబాద్ కు

Road Accident: అనకాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

  • యలమంచిలి జాతీయరహదారిపై రేగుపాలెం సమీపంలో ఘోర ప్రమాదం

  • కారును ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి

  • మొదట స్కూటీపై వెళుతున్న వక్తిని ఢీకొని తదుపరి పాదచారిపైకి దూసుకెళ్లిన కారు

  • ఈ ప్రమాదంలో ముగ్గురూ సంఘటనా స్థలంలోనే మృతి

  • విశాఖ వైపు నుండి విజయవాడవైపు వెళుతూ ముగ్గురినీ ఢీకొట్టిన కారు

  • మృతుల బంధువులు ఆందోళన

  • నిందితుడిని వెంటనే శిక్షించాలని హైవేపై బఠాయింపు, సుమారు రెండు కిలోమీటర్ల మేర ఆగిపోయిన ట్రాఫిక్

Telangana Government: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని కేంద్రం గుర్తించింది. దాదాపు రూ.152 కోట్లను దారి మళ్లించారని నోటీసుల్లో పేర్కొంది. రెండు రోజుల్లోగా దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే తదుపరి ఇవ్వాల్సిన నిధుల వాయిదాలను ఆపేస్తామని తేల్చి చెప్పింది.

Bandi Sanjay in Karimnagar: కరీంనగర్ లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

  • కరీంనగర్ లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

  • వేచి చూసే ధోరణి లో బీజేపీ శ్రేణులు

  • పాదయాత్ర సభ నిర్వహణ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

  • అనుమతి వస్తే మధ్యాహ్నం భైంసా వెళ్ళే అవకాశం 

  • భైంసాలో ఐదో విడత పాదయాత్ర సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

  • నిన్న రాత్రి కోరుట్ల మండలం వెంకటా పూర్ వద్ద అడ్డుకొని తిరిగి వెళ్లాలని కోరడంతో కరీంనగర్ వచ్చిన బండి సంజయ్

  • పోలీసులు అనుమతి ఇవ్వకున్నా భైంసా వెళ్తాం అంటున్న బండి సంజయ్ 

  • 10 గంటలకు కరీంనగర్ లోని మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకోనున్న బండి సంజయ్

  • బండి సంజయ్ ను కలవడానికి వచ్చిన పలువురు నేతలు కార్యకర్తలు 

  • కోర్టు అనుమతిని బట్టి బీజేపీ నిర్ణయం

  • ముందు జాగ్రత్తగా బండి సంజయ్ నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు

Background

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతానికి తమిళనాడు వైపు కదులుతోందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. తమిళనాడుపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.


ఏపీలో ప్రస్తుతం కాస్త దిగువన తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనుండగా.. వీటి ఫలితంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఆ తర్వాత ఏపీలో చలి పెరుగుతుందని చెప్పారు.


అదంతా ఫేక్ తుపాను నమ్మొద్దు - ఏపీ వెదర్ మ్యాన్
‘‘డిసెంబరు మొదటి వారంలో దక్షిణాంధ్రలో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వరకు మాత్రమే ఉంటుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారి దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు వైపుగా వస్తోంది. దీని వలన డిసెంబరు 1 నుంచి నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. నెల్లూరు నగరంలో కూడ కొన్ని వర్షాలుంటాయి. డిసెంబరు 2 నుంచి 4 మధ్యలో తిరుపతి జిల్లాలోని అన్ని భాగాలు ముఖ్యంగా తిరుపతి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. అన్నమయ్య​, ప్రకాశం కోస్తా భాగాల్లో కూడా, చిత్తూరు జిల్లాలోని కొన్ని వర్షాలను చూడగలము. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప జిల్లాలో తక్కువగానే వర్షాలుండనున్నాయి. 


మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం ఉండదు. విశాఖ​, విజయవాడ​, కాకినాడ​, రాజమండ్రిలో కూడా వర్షాలు ఉండవు. ముఖ్యమైన గమనిక - విండీ యాప్ లో ఏదో తుఫాను ఆంధ్ర వైపుగా చూపిస్తూ ఉందని ఫేక్ న్యూస్ ఛానల్స్ చాలా దారుణంగా భారీ తుఫాన్ అని మరో పది రోజుల వరకు ఫేక్ న్యూస్ ని చెప్పనున్నారు. వాస్తవానికి ఈ సమయంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రా వైపుగా రావడం చాలా అరుదు. ఇంకా చాలా సమయం ఉంది. దయజేసి విండీ ఆప్, ఫేక్ న్యూస్ గాలులను నమ్మి భయపడకండి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.


తెలంగాణ వాతావరణం ఇలా..
తెలంగాణలో నేటి (నవంబరు 28) నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత మాత్రం పెరుగుతుందని అంచనా వేశారు. సాధారణం కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. వచ్చే రెండు రోజులు చలి మరింత పెరుగుతుందని వెల్లడించారు.


హైదరాబాద్‌లో ఇలా
‘‘హైదరాబాద్ లో క్లియర్ స్కైట్. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 3 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


వివిధ చోట్ల చలి ఇలా..
నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. 


నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.