TGICET 2025 Admissions | తెలంగాణ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల కోసం ట్యూషన్ ఫీజులు చెల్లించడానికి గడువు నేటితో ముగుస్తుంది. అధికారులు గడువును పొడిగించిన తర్వాత తుదిగడువు సెప్టెంబర్ 24 అని ప్రకటించారు. విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలకు సెప్టెంబర్ 25లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తి కాగా, స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ (TG ICET 2025 Counselling) వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, TGICET 2025 అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన విడుదల చేశారు.

Continues below advertisement

స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలుతెలంగాణ ఐసెట్ (TG ICET) టీజీ ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో భాగంగా అక్టోబర్ 5న అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సెలింగ్ ఫీజును కూడా అభ్యర్థులు చెల్లించాలి. అక్టోబర్ 6వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 7వ తేదీన ఆప్షన్ల గడువు పూర్తి కానుంది. అక్టోబర్ 7న తమ ఆప్షన్ చేసుకోవాలి. 

సీట్లు కేటాయింపు అప్డేట్స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో పాల్గొన్న ఐసెట్ అభ్యర్థులకు అక్టోబర్ 10న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అక్టోబర్ 13వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. రిపోర్ట్ చేయని వారికి కేటాయించిన సీటు రద్దు అవుతుంది. కనుక అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని టీజీ ఐసెట్ అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన సూచించారు.

Continues below advertisement

రాష్ట్రంలో 276 మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద 30,587 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకూ జరిగిన కౌన్సెలింగ్‌లలో 26,131 సీట్లు భర్తీ చేశారు. 79 కాలేజీల్లో 7,227 ఎంసీఏ సీట్లకుగానూ 4,723 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లు భర్తీ చేయడానికి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చారు. 

TGICET-2025 SPECIAL PHASE SCHEDULE1 Online filing of Basic Information, Payment of Processing Fee and Slot Booking for selection of Help Line Centre, Date & Time to attend for Certificate Verification  05-10-20252 Certificate Verification for already Slot Booked Candidates     06-10-20253 Exercising of Options after Certificate  Verification    06-10-2025   To  07-10-20254 Freezing of Options 07-10-20255 Provisional Allotment of seats for Special Phase on or before  10-10-20256 Payment of Tuititon Fee , Self Reporting and  Reporting at the allotted college 10-10-2025  To  13-10-2025