Krieeti Reddy's Junior OTT Release On Aha: కర్ణాటక మాజీ మంత్రి, ఫేమస్ బిజినెస్ మ్యాన్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి, యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ డ్రామా 'జూనియర్'. జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా... కిరీటి డ్యాన్స్, శ్రీలీల వైరల్ వయ్యారి పాటలు ట్రెండింగ్‌గా మారాయి. ఈ నెల 22నే ఓటీటీలోకి వస్తుందని ముందే ప్రకటించినా అనివార్య కారణాలతో స్ట్రీమింగ్ కాలేదు. 

కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదే!

తాజాగా ప్రముఖ ఓటీటీ 'ఆహా' కొత్త స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ నెల 30 నుంచి మూవీ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. 'సీనియర్‌కి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయ్ అని జూనియర్ 30కి వస్తున్నాడు.' అంటూ క్యాప్షన్ ఇస్తూనే మరో పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ వెయిటింగ్ చెక్ పడింది.

Also Read: రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!

ఈ మూవీలో కిరీటి, శ్రీలలతో పాటు స్టార్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషించారు. కన్నడ యాక్టర్ రవిచంద్రన్, రావు రమేశ్, వైవా హర్ష, సత్య, అచ్యుత్ కుమార్, సుధారాణి కీలక పాత్రల్లో నటించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా... ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటికి చెందిన వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

జీవితంలో జ్ఞాపకాలే ముఖ్యం అనుకునే యువకుడు అభి (కిరీటి రెడ్డి). తన నాలుగేళ్ల ఇంజినీరింగ్ లైఫ్‌ను ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. చిన్నప్పటి నుంచి తాను కోల్పోయిన జీవితాన్ని ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాల్లోనే గుర్తించుకుంటాడు. తనకు లేక లేక పుట్టిన కొడుకని అభిపై అతి ప్రేమ చూపిస్తుంటాడు తండ్రి (రవిచంద్రన్). దీన్ని తట్టుకోలేని అభి చదువు పూర్తైన వెంటనే తండ్రికి దూరంగా వెళ్లే ఉద్దేశంతో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు. ఇదే ఆఫీసులో తాను ప్రేమించిన స్ఫూర్తి (శ్రీలీల) జాబ్ చేస్తుంటుంది.

అయితే, కంపెనీలో చేరిన ఫస్ట్ రోజే బాస్ విజయ (జెనీలియా)కు అభిపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. దీంతో ఆమెకు అభి అన్నా తన పేరుతో ఉన్న విజయనగరం అన్నా నచ్చదు. అలాంటి విజయ తప్పనిసరి పరిస్థితుల్లో తనకి ఇష్టం లేని ఊరికి ఇష్టం లేని అభితో వెళ్లాల్సి వస్తుంది. అసలు అక్కడకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? విజయకు ఆ ఊరికి సంబంధం ఏంటి? విజయనగరం అంటే ఎందుకు ఆమెకు నచ్చదు? అభి తండ్రికి ఆ ఊరికి సంబంధం ఏంటి? ఇందులో స్ఫూర్తి పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.