Priyanka Arul Mohan's OTT Debut: ప్రియాంక అరుల్ మోహన్ కన్నడ అమ్మాయి. కథానాయికగా తన తొలి సినిమా కన్నడలో చేసింది. ఆ తర్వాత 'నానీస్ గ్యాంగ్ లీడర్'తో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టింది. శర్వానంద్ సరసన 'శ్రీకారం' చేశాక... శివకార్తికేయన్ 'డాక్టర్'తో తమిళ తెరపై అడుగు పెట్టింది. ఆ తర్వాత నుంచి కన్నడలో సినిమా చేసే అవకాశం రాలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఫుల్ బిజీ అయ్యింది. ఇప్పుడీ అమ్మాయి ఓటీటీలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యింది.
రా కార్తీక్ దర్శకత్వంలో ప్రియాంక!దర్శకుడు రా కార్తీక్ (Director Ra Karthik) పేరు విన్నారా? కింగ్ అక్కినేని నాగార్జున వందో సినిమాకు దర్శకుడు. ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' కార్యక్రమానికి వచ్చిన నాగార్జున, ఏడాదిగా రా కార్తీక్ తన వందో సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారని తెలిపారు. అయితే కింగ్ 100 కంటే ముందు మరొక సినిమా చేయనున్నారు దర్శకుడు.
ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేసేందుకు రా కార్తీక్ ప్లాన్ చేశారు. అయితే ఇది థియేట్రికల్ సినిమా కాదు. వెబ్ ఫిల్మ్. అంటే... ఓటీటీ కోసం తీస్తున్న సినిమా. ఫిమేల్ సెంట్రిక్ కథతో సినిమా ఉంటుందని తెలిసింది. ఆల్రెడీ చర్చలు ముగిశాయి. సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది కూడా!
Priyank Mohan OTT Movie: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు రా కార్తీక్ కలిసి సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో కొంత షూటింగ్ చేశారు. సౌత్ కొరియాలో మెజారిటీ షూట్ చేయడానికి ప్లాన్ చేశారట. ఈ సినిమాను రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది. వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సినిమా విడుదల కానుందని తెలిసింది.
Also Read: ఎక్స్‌క్లూజివ్... ఇంజ్యూరీ తర్వాత రోజు షూటింగ్ - దటీజ్ ఎన్టీఆర్, డెడికేషన్‌కు మారు పేరు
Priyanka Arul Mohan Next Movie After OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'ఓజీ' తర్వాత ప్రియాంక అరుల్ మోహన్ సంతకం చేసిన సినిమా ఇదేనని సమాచారం. 'ఓజీ' కాకుండా తమిళంలో కెవిన్ సరసన ఆవిడ ఓ సినిమా చేస్తోంది. నాగార్జున వందో సినిమాకు రెడీ అయ్యే సమయంలో దర్శకుడు రా కార్తీక్, నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు.
కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటి వరకు పదికి పైగా సినిమాలు చేశారు. తెలుగులో పవన్ కళ్యాణ్, నాని... తమిళంలో ధనుష్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేశారు. ఓటీటీ కోసం ఆవిడ సినిమా చేస్తుండటం ఇదే మొదటిసారి. ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుండటం కూడా ఇదే తొలిసారి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: పవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?