Upcoming Telugu Movies In Theaters OTT Releases In September Last Week 2025: ఈ వారం థియేటర్లలో ఒకే ఒక సినిమా సందడి కనిపించనుంది. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ'. దీంతో పాటు రిలీజ్‌కు ముందే ఆస్కార్‌కు నామినేట్ అయిన మూవీ కూడా థియేటర్లలోకి రానుంది. 

Continues below advertisement

గ్యాంగ్ స్టర్ డ్రామాగా పవన్ 'OG'

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG'. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో 24న రాత్రి ప్రీమియర్ షోస్ కూడా వేయనున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా పవన్ ఇందులో 'గంభీర' పాత్రలో గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందించారు.

Continues below advertisement

ఆస్కార్‌కు నామినేట్ అయిన 'హౌమ్ బౌండ్'

బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించిన మూవీ 'హోమ్ బౌండ్'. నీరజ్ ఘేవాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఆస్కార్‌కు నామినేట్ అయ్యి రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియా తరఫున 98వ అకాడమీ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో ఎంపికైంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించగా అందరి ప్రశంసలు అందుకుంది. నార్త్ ఇండియాలో ఓ చిన్న గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూ పోలీస్ కావాలని కలలు కంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన పరిణామాలు, ఇబ్బందులను మూవీలో చూపించారు. 

Also Read: 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్... వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ - భారీ వర్షంలో బిగ్గెస్ట్ హిట్ షో

ఓటీటీల్లో మూవీస్/ వెబ్ సిరీస్‌ల లిస్ట్

మరోవైపు ఓటీటీల్లోనూ పలు మూవీస్, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. కిరీటి రెడ్డి, శ్రీలీల 'జూనియర్' మూవీ నుంచి యంగ్ హీరో నారా రోహిత్ 'సుందరకాండ', మలయాళ స్టార్ మోహన్ లాల్ రొమాంటిక్ కామెడీ మూవీ 'హృదయ పూర్వం' కూడా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.

  • మలయాళ స్టార్ మోహన్ లాల్, మాళవికా మోహనన్, 'ప్రేమలు' ఫేం సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించిన 'హృదయ పూర్వం' ఈ నెల 26 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా... మలయాళంలో మంచి విజయం అందుకుంది. ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
  • గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ 'జూనియర్' సోమవారం నుంచి ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • యంగ్ హీరో నారా రోహిత్ లేటెస్ట్ లవ్ రొమాంటిక్ కామెడీ మూవీ 'సుందరకాండ' ఈ నెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘనీ హీరోయిన్లుగా నటించారు

సెప్టెంబర్ 23 - ది ఫెంటాస్టిక్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లస్), ది కట్ (ప్రైమ్ వీడియో), స్ప్లిట్ స్విల్లె (ప్రైమ్ వీడియో)

సెప్టెంబర్ 24 - మార్వెల్ జాంబీస్ (జియో హాట్ స్టార్), స్లో హార్సెస్ సీజన్ 5 (యాపిల్ టీవీ ప్లస్), ది డెవిల్స్ బిజీ (జియో హాట్ స్టార్), ది గెస్ట్ (నెట్ ఫ్లిక్స్)

సెప్టెంబర్ 25 - అలైస్ ఇన్ బార్డర్ ల్యాండ్ సీజన్ 3 (నెట్ ఫ్లిక్స్), హౌస్ ఆఫ్ గిన్నిస్ (నెట్ ఫ్లిక్స్), వే వార్డ్ (నెట్ ఫ్లిక్స్

సెప్టెంబర్ 26 - హృదయపూర్వం (జియో హాట్ స్టార్), ఓడు కుతీర చాదుం కుతీర (నెట్ ఫ్లిక్స్), సుమతి వలవు (జీ5), డేంజసర్ యానిమల్స్ (లయన్స్ గేట్ ప్లే), షార్క్ ట్యాంక్ (జియో హాట్ స్టార్), మాంటిస్ (నెట్ ఫ్లిక్స్), ఫ్రెంచ్ లవర్ (నెట్ ఫ్లిక్స్), ఆల్ ఆఫ్ యు (యాపిల్ టీవీ ప్లస్), రుత్ అండ్ బాజ్ (నెట్ ఫ్లిక్స్), ది మ్యాన్ ఇన్ మై బేస్మెంట్ (Hulu), వెంట్ అప్ ది హిల్ (ప్రైమ్ వీడియో), ది గెస్ట్ (నెట్ ఫ్లిక్స్), అలైస్ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), మాంటిస్ (నెట్ ఫ్లిక్స్), హౌస్ ఆఫ్ గిన్నీస్ (నెట్ ఫ్లిక్స్)

సెప్టెంబర్ 27 - బ్లీడింగ్ టైగర్ (నెట్ ఫ్లిక్స్)

సెప్టెంబర్ 28 - డెడ్త్ ఆఫ్ ఏ యూనికార్న్ (జియో హాట్ స్టార్), ది ఫ్రెండ్ (జియో హాట్ స్టార్), ది ఉమెన్ ఇన్ ది యార్ట్ (జియో హాట్ స్టార్), ది బెల్లెడ్ ఆఫ్ వాసిల్ ఐలాండ్ (జియో హాట్ స్టార్).