మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) అంటే డెడికేషన్ అండ్ కమిట్మెంట్. ఆయన దర్శక నిర్మాతల కథానాయకుడు. తనకు కష్టం ఎదురైనా సరే నిర్మాతకు నష్టం కలగకూడదని ఆలోచించే వ్యక్తి. అందుకే ఇంజ్యూరీ అయిన మర్నాడు మళ్ళీ షూటింగ్ చేశారు. యాడ్ కంప్లీట్ చేశారు.
ఇంజ్యూరీ తర్వాత షూట్... యాడ్ కంప్లీట్!ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ గాయపడ్డారు. ఆ విషయాన్ని హీరో ఆఫీస్ ఓ ప్రకటనలో వివరించింది. అయితే... ఎన్టీఆర్ (NTR Injured)కు స్వల్ప గాయాలు అయ్యాయని, వైద్యుల సలహా మేరకు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటారని, పూర్తిగా రికవరీ అయ్యే వరకు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారని తెలిపారు. అయితే... ఇంజ్యూరీ అయిన మర్నాడు ఎన్టీఆర్ షూటింగ్ చేశారు. ఆ యాడ్ కంప్లీట్ చేశారు.
యాడ్ షూటింగ్ కోసం హైదరాబాద్ సిటీలో ఒక ప్రయివేటు స్టూడియోలో ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ రికవరీ అయ్యే వరకు స్టూడియోలో సెటప్ అంతా అలా ఉంచితే రెంట్ పెరుగుతుంది. టీం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది తెలిసి నెక్స్ట్ డే ఎన్టీఆర్ షూటింగుకు వెళ్లారు. నొప్పిని భరిస్తూ ఆ యాడ్ కంప్లీట్ చేసి వచ్చారు. ఎన్టీఆర్ చూపిన డెడికేషన్, వర్క్ పట్ల కమిట్మెంట్ చూసి యాడ్ ఫిల్మ్ మేకర్స్, టీమ్ అంతా ఫిదా అయ్యారు.
Also Read: 'ఓజీ' సెన్సార్ పూర్తి... కట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో... 'మగధీర' తర్వాత మెగా మూవీకి 'ఏ'?
రికవరీ అయ్యాక నీల్ ఫిల్మ్ షూట్ మొదలు!NTR Upcoming Movie Dragon Update: ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (టైటిల్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు) చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంజ్యూరీ నుంచి రికవరీ అయ్యాక ఆ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఆ సినిమా కాకుండా మరొక రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. శివ కొరటాల దర్శకత్వంలో 'దేవర 2' చేయాల్సి ఉంది. 'డ్రాగన్' పూర్తి అయ్యాక ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ వస్తుంది.
Also Read: పవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?