Pawan Kalyan's OG censor board cut scenes list: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ'. సెప్టెంబర్ 24వ తేదీన పెయిడ్ ప్రీమియర్ షోలతో సినిమా విడుదల కానుంది. ఆ మర్నాడు (సెప్టెంబర్ 25వ తేదీన) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోమవారం సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ లభించింది. మరి, ఇందులో ఏ సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేసిందో తెలుసా?

Continues below advertisement

'ఓజీ'లో కట్ చేసిన సీన్లు ఇవే!'ఓజీ' ట్రైలర్ చూస్తే భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సులభంగా అర్థం అవుతోంది. సినిమాలో వయలెన్స్ ఒక రేంజ్‌లో ఉందట. ఇప్పుడు ఆ హింసకు కొంత కత్తెర పడింది. ఫస్టాఫ్‌లో ఒక చెయ్యిని నరికే సన్నివేశం, అలాగే తలను నరికే సన్నివేశం తీసేయమని సెన్సార్ బోర్డు పేర్కొంది. ఆ సన్నివేశాలను రీప్లేస్ చేశారు.

లాడ్జ్ నేపథ్యంలో 'ఓజీ'లో ఒక సీన్ ఉంది. అందులో క్లోజప్ సీన్స్ తీసేయమని 'ఓజీ' బృందాన్ని సెన్సార్ బోర్డు ఆదేశించింది. దాంతో అక్కడ మార్పులు చేశారు. మూవీ ఇంటర్వెల్ ముందు సుమారు నిమిషం నిడివి ఉన్న సీన్స్ తొలగించారు.

Continues below advertisement

రక్తపు మడుగులో చిన్నారి... లేదు!'ఓజీ' సెకండాఫ్ విషయానికి వస్తే.., రక్తపు మడుగులో ఒక చిన్నారి ఉందట. ఆ సీన్ మార్చమని సెన్సార్ చెప్పడంతో మార్పులు - చేర్పులు చేసింది చిత్ర బృందం. ఓ పోలీస్ అధికారి జిప్ ఓపెన్ చేసే సన్నివేశంలో సైతం మార్పులు చేశారు. ఇంటర్వెల్ తర్వాత సుమారు 40 సెకన్ల హింసాత్మక సన్నివేశాలకు కత్తెర వేశారు. దాంతో టోటల్ 1.55 నిమిషాల సీన్లకు కత్తెర పడింది.

Also Readపవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?

సెన్సార్ కోసం 'ఓజీ' చిత్ర బృందం 156.10 నిమిషాల సినిమాను సబ్మిట్ చేసింది. కట్స్ తర్వాత 154.15 నిమిషాలు వచ్చింది. సో... మూవీ రన్ టైమ్ రెండున్నర గంటలు అన్నమాట. యాక్షన్ సీన్స్, వయలెన్స్ వల్ల సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ వచ్చిందని సమాచారం.

పదహారేళ్ళ తర్వాత మెగా మూవీకి 'ఏ'!పవన్ కళ్యాణ్ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ రావడం అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన సినిమాకు యు లేదా యు/ఏ సర్టిఫికెట్ రావడం కామన్. సో, లాస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ లేదా మెగా ఫ్యామిలీలో హీరోలు నటించిన సినిమాలకు ఎప్పుడు 'ఏ' సర్టిఫికెట్ వచ్చింది? అనేది చూస్తే... రామ్ చరణ్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'మగధీర'కు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీ మూవీకి 'ఏ' సర్టిఫికెట్ రావడం ఇదేనని అంటున్నారు.

Also Readమనల్ని ఎవడ్రా ఆపేది... వర్షంలోనూ ఎల్బీ స్టేడియాన్ని వీడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!

పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన 'ఓజీ'కి సుజీత్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.