'ఫైర్ స్ట్రోమ్ వస్తుందని అనుకుంటే థండర్ స్ట్రోమ్ వచ్చింది' - ఇదీ దర్శకుడు సుజిత్ డైలాగ్. ఒక్కమాటలో ఆయన తన స్పీచ్ ముగించారు. ఎందుకంటే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ సిటీలో వర్షం పడుతుందని ముందుగా ఊహించలేదు గనుక! వర్షం పడినా సరే అభిమానులు కదల్లేదు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అక్కడే నిలబడ్డారు. దాంతో వర్షంలో 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
వర్షంలో లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన తమన్ టీమ్!సంగీత దర్శకుడు తమన్ టీమ్ 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చాలా ప్రిపేర్ అయ్యింది. స్టేజి మీద లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ఆల్మోస్ట్ 50 మందికి పైగా టీం రెడీ అయ్యింది. అయితే అనుకోకుండా భారీ వర్షం వచ్చింది. చినుకులు పడుతున్న సరే తమన్ టీం స్టేజి మీద నుంచి కదల్లేదు. స్టేజి ముందున్న ఫ్యాన్స్ కూడా కదల్లేదు.
''వర్షం వచ్చిన మేము ఇక్కడే ఉంటాం. మన హీరో గారి డైలాగ్ ఒకటి చెబుతా మనల్ని ఎవడ్రా ఆపేది'' అంటూ తమన్ ప్రేక్షకులలో, మరి ముఖ్యంగా స్టేజి ముందున్న అభిమానులలో ఎనర్జీ నింపారు. ఆ తర్వాత స్టేజీపై తమన్ టీం వర్షంలోనే ఒక పాటకు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దర్శకుడు సుజిత్ గురించి తమన్ గొప్పగా చెప్పారు. రెండేళ్లు కష్టపడి సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడని పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినటువంటి సుజిత్ అభిమానులు అందరూ ఆయనను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా చూపించారని చెప్పుకొచ్చారు తమన్. తన స్పీచ్ ముగించిన తర్వాత తమన్ షో స్టార్ట్ అవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తమన్ కూడా రెడీ అయ్యారు. కానీ వర్షం వల్ల ఈవెంట్ ముగించారు.
వర్షం వచ్చేసింది... ఇలా అవుతుందనుకోలేదు!హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ సైతం వర్షంలో మాట్లాడారు. తన అసిస్టెంట్ గొడుగు పట్టుకోగా స్టేజీ మీదకు వచ్చారు. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతూ... ''వర్షం వచ్చేసింది ఇలా అవుతుందని అనుకోలేదు. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నా జీవితంలో ఇంత మంది క్రౌడ్ వేదిక ముందు చూడడం ఇదే మొదటిసారి. ఇంత ఎనర్జీ చూడలేదు'' చెప్పారు. వర్షం వల్ల పలువురు ప్రముఖులు స్టేజి మీద మాట్లాడడం కుదరలేదు.
Also Read: పవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?
'ఓజీ'లో విలన్ రోల్ చేసిన ఇమ్రాన్ హష్మీ సహ తెలుగు చలన చిత్ర సీమలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, 'దిల్' రాజు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన రవిశంకర్ ఎలమంచిలి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే వాళ్లు మాట్లాడడం కుదరలేదు. నిర్మాత డీవీవీ దానయ్య, ఆయన తనయుడు కళ్యాణ్ దాసరి సహా టీమ్ కూడా పాల్గొంది. ఆల్మోస్ట్ 30 వేల మందికి పైగా అభిమానులు వచ్చినట్లు అంచనా.
Also Read: చిరంజీవి వల్ల ఆస్తులు అమ్ముకున్నారా? 'భోళా శంకర్' డిజాస్టర్, ప్రచారంపై అనిల్ సుంకర రియాక్షన్