ఆడియన్స్ అంత ఈజీగా అన్ని సినిమాలను చూడటం లేదు. వాళ్ళ దృష్టిలో మూవీ పడాలంటే అందులో సంథింగ్ స్పెషల్ ఉండాలి. హీరో కమ్ డైరెక్టర్ త్రినాథ్ కఠారి అదే పని చేశారు. తన సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టారు. అది 'ఇట్లు మీ ఎదవ'. మీరు చదివింది నిజమే... సినిమా టైటిల్ అదే.
బుచ్చిబాబు ఆవిష్కరించిన టైటిల్ గ్లింప్స్!త్రినాథ్ కఠారి (Thrinadh Katari) కథానాయకుడిగా నటించడం మాత్రమే కాదు... దర్శకత్వం వహించిన సినిమా 'ఇట్లు మీ ఎదవ'. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు... అనేది ఉపశీర్షిక. సంజీవని ప్రొడక్షన్స్ పతాకంపై బళ్లారి శంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదొక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇందులో తెలుగు అమ్మాయి సాహితీ అవాంఛ హీరోయిన్. 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన బుచ్చిబాబు సానా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.
ప్రేమించే అర్హత ఉందా? లేదా?''ఎదవ నా కొడకా అంటే ఎవరికీ కోపం రాదు? నాకూ వచ్చింది. ఒకవేళ ప్రతి అబ్బాయి జీవితం ఇంతేనేమో!? ప్రేమలో ఉన్నంత సేపూ ఏదీ గుర్తుకు రాదు. ఒక్కసారి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మన జీవితంలోకి ఎంటర్ అయ్యాక స్టోరీ మొత్తం మారిపోతుంది. అయినా ప్రేమించడానికి కూడా ఉద్యోగం, డబ్బు, హోదా వంటి అర్హతలు అన్నీ ఉండాలా? ఇవేవీ లేకపోతే ప్రేమించకూడదా!? అదే... నా లాంటి ఎదవలకు ప్రేమించే అర్హత ఉందా? లేదా?'' అంటూ 'ఇట్లు మీ ఎదవ' టైటిల్ గ్లింప్స్‌లో త్రినాథ్ కఠారి డైలాగ్ చెప్పారు. ఆస్పత్రిలో ఆయన ఎందుకు ఉన్నారు? అనేది సస్పెన్స్.
Also Read: చిరంజీవి వల్ల ఆస్తులు అమ్ముకున్నారా? 'భోళా శంకర్' డిజాస్టర్, ప్రచారంపై అనిల్ సుంకర రియాక్షన్
'ఇట్లు మీ ఎదవ' టైటిల్ గ్లింప్స్ విడుదల చేసిన తర్వాత బుచ్చిబాబు సానా మాట్లాడుతూ... ''ఇప్పుడే ఈ సినిమా గ్లింప్స్ చూశా. చాలా బావుంది. ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుండి కెరీర్‌లో సెటిల్ అయ్యాక కూడా కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టారని నవ్వుకున్నా. ఇదొక మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ మూవీ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్'' అని అన్నారు.
Itlu Me Yedhava Cast And Crew: త్రినాథ్ కఠారి కథానాయకుడిగా, సాహితీ అవాంఛ కథానాయికగా నటించిన 'ఇట్లు మీ ఎదవ' సినిమాలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్, 'చలాకీ' చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ ఇతర కీలక తారాగణం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ స్వరాలు, నేపథ్య సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: త్రినాథ్ కఠారి, నిర్మాత: బళ్లారి శంకర్, నిర్మాణ సంస్థ: సంజీవని ప్రొడక్షన్స్, ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి, కూర్పు: ఉద్ధవ్ ఎస్బీ.