OG Movie Pre Release Event Full Details: 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఈ రోజే (అంటే సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం). 'ఓజీ కాన్సర్ట్' పేరుతో జరిగే ఈ వేడుక కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథి ఎవరు? వెన్యూ నుంచి ఈవెంట్ ప్లాన్, గెస్ట్స్ వరకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.

Continues below advertisement

'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ?OG Concert - LB Stadium: హైదరాబాద్ సిటీలోని ఎల్బీ స్టేడియంలో 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 21వ తేదీ) సాయంత్రం ఐదు గంటలకు ఈవెంట్ మొదలు అవుతుందని పేర్కొన్నారు. కానీ, ప్రారంభం అయ్యే సరికి ఆరు గంటలు అవుతుంది. 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ శిల్పకళా వేదికలో చేశారు. ఆ ఆడిటోరియం కెపాసిటీ తక్కువ. ఎక్కువ మంది అభిమానులకు పవన్ కళ్యాణ్‌ను చూసే అవకాశం దక్కలేదు. అందుకని ఈసారి ఎల్బీ స్టేడియంలో 'ఓజీ కాన్సర్ట్' నిర్వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియం కెపాసిటీ 30 వేలు. ఆల్రెడీ పవన్ అభిమానులకు ఈవెంట్ పాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. పాతిక వేల మందికి పైగా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రేయాస్ మీడియా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తోంది.

తమన్ 'ఓజీ' లైవ్ పెర్ఫార్మన్స్ స్పెషల్ ఎట్రాక్షన్!'ఓజీ కాన్సర్ట్'లో స్పెషల్ ఎట్రాక్షన్ అంటే... సంగీత దర్శకుడు తమన్ ఇచ్చే లైవ్ పెర్ఫార్మన్స్. ఇప్పటి వరకు 'ఓజీ' నుంచి వచ్చిన ఒక్కో పాట ఒక్కో స్టైల్‌లో ఉంది. చార్ట్ బస్టర్ అయ్యింది. ఆ పాటలను స్టేజి మీద తన బృందంతో తమన్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఇటీవల థియేటర్లలో కొత్త సినిమాలు చూడటానికి వెళ్ళారా? బ్రేక్ టైంలో 'ఫైర్ స్ట్రోమ్' ప్లే చేశారు. స్క్రీన్ మీద ఆ సాంగ్ రాగానే థియేటర్లు దద్దరిల్లాయి. ఇప్పుడు ఎల్బీ స్టేడియం అంతా దద్దరిల్లుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'ఓజీ' ట్రైలర్‌ (OG Trailer Release Date)ను కూడా ఈవెంట్‌లో రిలీజ్ చేయనున్నారు.

Continues below advertisement

పవన్ కళ్యాణ్ ఉండగా మరొక గెస్ట్‌ ఎందుకు?OG Concert Chief Guest: సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలకు ముఖ్య అతిథులు అంటూ ఎవరూ ఉండరు. అతి తక్కువ వేడుకలకు మాత్రమే మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు. 'ఓజీ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన వస్తారని ప్రచారం జరిగింది. అయితే... చిరు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని సమాచారం.

Also Readపవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?

ఇప్పటి వరకు 'ఓజీ' కాన్సర్ట్ నిర్వాహకులకు ముఖ్య అతిథిగా ఫలానా వ్యక్తి వస్తారని ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఈవెంట్ మెయిన్ ఎట్రాక్షన్ అని తెలిసింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సహా కొంత మంది జనసేన పార్టీ నాయకులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

'ఓజీ' దర్శక నిర్మాతలు సుజీత్, డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరితో పాటు హీరో హీరోయిన్లు, కీలక పాత్రల్లో నటించిన కొందరు ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు వేడుకకు హాజరు అవుతారు.

Also Readదక్ష రివ్యూ: సన్నాఫ్ ఇండియా దర్శకుడి కథతో... మోహన్ బాబు - లక్ష్మీ మంచు సినిమా... మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?