థియేటర్లలో 'మహావతార్ నరసింహ' సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ బరిలో 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. థియేటర్లలో విడుదలైన 56 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైన 24 గంటలలో ఇండియాలో నెంబర్ వన్ ప్లేసులో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే సినిమా క్వాలిటీ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. అందుకు కారణం ఏమిటంటే?
ఓటీటీలో ప్రింట్ అలా ఉందేంటి?బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేశారేంటి??నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'మహావతార్ నరసింహ' సినిమా చూసి జనాలు షాక్ అవ్వడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది... యానిమేషన్ క్యారెక్టర్ ఒక స్కేల్ లో ఉంటే, వెనుక బ్యాగ్రౌండ్ దాని కంటే తక్కువ స్కేల్ లో ఉంది. లాప్ టాప్, టీవీలలో 'మహావతార్ నరసింహ' స్ట్రీమింగ్ చేసేటప్పుడు స్క్రీన్ పైన, కింద కొంత బ్లాక్ బ్యాగ్రౌండ్ ఉంటుంది. ప్రహ్లాదుడు లేదా హిరణ్య కశిపుడి తల వెనుక బ్లాక్ బ్యాగ్రౌండ్ డిస్టర్బ్ చేస్తుంది. మరొక సమస్య ఏమిటంటే... త్రీడీ కళ్ళజోడు లేకుండా థియేటర్లలో సినిమా చూస్తే ఎలా ఉంటుందో? ఆ విధమైన ప్రింట్ స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు.
Also Read: పవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?
తప్పు చేసిందెవరు? ఎందుకిలా?నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తప్పు చేసిందా? లేదంటే వాళ్లకు సరైన ప్రింట్ ఇవ్వడంలో 'మహావతార్ నరసింహ' టీం తప్పు చేసిందా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. థియేటర్లలో 2d యానిమేషన్ లేదా త్రీడీ క్వాలిటీ చూసి ఆడియన్స్ అప్రిషియేట్ చేశారు. అటువంటి సినిమా ఓటీటీలో ఈ విధంగా స్ట్రీమింగ్ అవుతుందంటే ముందుగా సరిగా చెక్ చేసుకోకపోవడమే కారణం.
సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ సాధించిన యానిమేషన్ సినిమా 'మహావతార్ నరసింహ'. ఈ చిత్రాన్ని 2dతో పాటు త్రీడీలోనూ విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ మలయాళ హిందీ తదితర భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రేక్షకులు అందరి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అశ్విన్ కుమార్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా 300 కోట్లు వసూలు చేసింది.