Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ రద్దుపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Dec 2022 04:48 PM
ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ రద్దుపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం 

ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తుంది. సిట్ ను దర్యాప్తును రద్దు చేయడంతో సుప్రీంకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం 

తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడంలేదన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. 

Mudragada Padmanabham: సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం లేఖ

  • సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం లేఖ

  • సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ పై ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి  ఇచ్చిన సమాధానంపై దృష్టి పెట్టాలని వినతి

  • రిజర్వేషన్లపై పరిశీలన చేయాలని లేఖలో కోరిన ముద్రగడ

  • అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరిన ముద్రగడ

  • ‘‘2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపుకు కృషి చేశారు

  • కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుంది

  • మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలి

  • ఎన్టీఆర్, వైఎస్ఆర్ ల ను ప్రజలు దేవుళ్ళలా  భావించారు, పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలి

  • రిజర్వేషన్లు కల్పించడానికి ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలి

  • నా జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదు’’ అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

నేషనల్‌ ఉమెన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిఖత్ జరీన్

తెలంగాణ బాక్సర్‌ నిఖత్ జరీన్‌ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకన్నారు. భోపాల్‌లో జరుగుతున్న నేషనల్‌ ఉమెన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో విజయం సాధించారు. బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అనామికపై 4-1 తేడాతో నిఖత్‌ జరీన్‌ విజయం సాధించారు . 

TRS MLAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి

  • రెండు రోజుల పాటు విచారణ కు అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు

  • ఈ నెల 26, 27 న నంద కుమార్ ను విచారించనున్న ఈడీ అధికారులు

  • నేడు, మంగళవారం రెండు రోజుల పాటు విచారించునున్న ఈడీ అధికారులు

  • సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు చంచలగూడ జైల్లో విచారించనున్న ఈడీ అధికారులు

  •  చంచలగూడ జైల్లో నందకుమార్ స్టేట్మెంట్ నమోదు చేయనున్న ఈడీ అధికారులు

ఎల్లుండి సాయంత్రం ఢిల్లీకి సిఎం జగన్- ప్రధాని మోడీతో సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి(బుధవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న జగన్.... గురువారం ప్రధానమంత్రి మోదీతో సమావేశం కానున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

విశాఖలో మెడికల్ విద్యార్థి అనుమానాస్పద మృతి

విశాఖలో ఓ వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విశాఖ జిల్లా ఎండాడ వైశాఖి స్కైలైన్‌లోని అపార్ట్మెంట్ పైనుంచి పడి గోగినేని గిరితేజ అనే మెడికల్ విద్యార్థి కిందపడి మరణించాడు. గీతం యూనివర్సిటీలో గోగినేని గిరితేజ ఎం.బి.బి.ఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్కైలైన్ అపార్ట్మెంట్ బి 4 బ్లాక్ పైనుంచి కిందపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Visakhapatnam News: విశాఖలో మెడికల్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి

అనుమానాస్పద స్థితిలో అపార్ట్మెంట్ పై నుండి పడి మెడికల్ విద్యార్థి మృతి చెందాడు. విశాఖ జిల్లా ఎండాడ వైశాఖి స్కైలైన్ లో అనుమానస్పద స్థితిలో అపార్ట్మెంట్ పైనుంచి పడి గోగినేని గిరితేజ అనే మెడికల్ విద్యార్థి చనిపోయాడు. గీతం యూనివర్సిటీ లో గోగినేని గిరితేజ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువు తున్నాడు. స్కైలైన్ అపార్ట్మెంట్ బి 4 బ్లాక్ పైనుండి కిందపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Banjara Hills: బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో హిజ్రాల వీరంగం

  • బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో హిజ్రాల వీరంగం

  • తమను రౌడీలతో వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్‌లో రెండో గ్రూపునకు చెందిన హిజ్రాల ఆందోళన

  • పోలీస్ స్టేషన్‌లో హంగామా సృష్టించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం

Gachibowli Accident: గచ్చిబౌలిలో టిప్పర్ భీభత్సం, ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి

  • గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో కూడలి వద్ద టిప్పర్ లారీ భీభత్సం

  • సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 4 కార్లు 2 బైక్ ల మీదకు దూసుకెళ్లిన టిప్పర్

  • రెడ్ సిగ్నల్ ఉన్నా   ఆగకుండా ముందు ఉన్న వాహనాలను డీ కొన్న టిప్పర్ లారీ

  • నుజ్జు నుజ్జైన నాలుగు కార్లు, 2 ద్విచక్ర వాహనాలు

  • ఘటనా స్థలంలో మృతి చెందిన  ఫుడ్ డెలివరీ బాయ్ నసీర్

  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, 6 గురికి స్పల్ప గాయాలు

Background

శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం పశ్చిమ నైరుతిగా కదిలి ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటింది. ఇదే సమయంలో అది తీవ్ర అల్పపీడనంగా బలహీనం చెందింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తూ నేడు (డిసెంబరు 26) ఉదయానికి కొమరిన్‌ తీరం దిశగా వస్తుందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిస్తున్నాయి. 


రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.


‘‘వాయుగుండం శ్రీలంకను తాకినా తేమ గాలులు నేరుగా దక్షిణ ఆంధ్రాని తాకుతున్నాయి. దీని వలన రేపు ఉదయం వరకు ప్రకాశం జిల్లా కోస్తా భాగాలు, బాపట్ల జిల్లా కోస్తా భాగాలు, నెల్లూరు జిల్లా కోస్తా భాగాలతో పాటుగా కృష్ణా జిల్లా కోస్తా భాగాల్లో అక్కడక్కడ మనం వర్షాలను చూడగలం. తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలోని వివిధ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ-ఆగుతూ కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన మేఘాలు నేరుగా నెల్లూరు నగరంలోకి విస్తరిస్తు్న్నాయి. మరో గంటపాటు నెల్లూరు నగరం వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాల్లో వర్షాలు ఉండనున్నాయి. తెల్లవారుజామున వరకు ఇదే పరిస్ధితి కొనసాగనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఇక రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, అరకులోయ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగింది. పాడేరు సమీపంలోని జి.మాడుగులలో 5.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


రాయలసీమ ప్రాంతంలో సోమవారం కొన్ని జిల్లాల్లో చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.


తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,850 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,380 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,200 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,850 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,380 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,200 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.