Kazakhstan Passenger Plane Crash | అజర్‌బైజాన్: కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోయింది. విమానం క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో విమానంలో 110 మంది వరకు ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని సమాచారం.


అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని  గ్ర్జోనీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దారి మళ్లించారు. కానీ అంతలోనే అక్టౌ సిటీ సమీపంలో విమానం క్రాష్ అవడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ విమానం క్రాష్ అయినట్లు నిర్ధారించినట్లు రాయిటర్స్ నివేదించింది.






ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయం, అంతలోనే విషాదం..


విమానంలో ప్రయాణిస్తున్న వారిలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని ప్రాథమికంగా తెలుస్తోంది.  ఎయిర్ క్రాఫ్ట్ దాని ఆల్టిట్యూడ్ కోల్పోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానాశ్రయం పక్కనే కూలిపోగా, వెంటనే మంటలు చెలరేగి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. వాతావరణం సహకరించక ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని భావించారు. కానీ అంతలోనే 4K-AZ65 విమానం క్రాష్ కావడం దురదృష్టకరమని అధికారులు పేర్కొన్నారు. ఫ్లైట్ రాడార్ 24 వెబ్ సైట్ ప్రకారం.. ఆ విమానం కాస్పియన్ సముద్రం మీదుగా రష్యాలోని ఛెంచెన్యాకు వెళ్లాల్సి ఉంది. కానీ రష్యా గగనతల సరిహద్దుకు చేరుకోగానే కాస్పియన్ సముద్రానికి సమీపంలో ఎయిర్ పోర్టు పక్కన అక్టౌ సిటీలో విమానం కూలిపోయింది. కూలిపోవడానికి మూడు కిలోమీటర్ల ముందే ఎమర్జన్సీ ల్యాండింగ్ కు నిర్ణయం తీసుకున్నారు. అంతలోనే ఘోరం జరిగిందని ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది.






Also Read: SIM Swap Scam: వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ