Breaking News Live Telugu Updates: తెలంగాణ సంపద ఆంధ్రులకు కట్టబెడుతున్న బిఆర్ఎస్: ప్రవీణ్ కుమార్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) నియోజకవర్గాన్ని తెలంగాణలో విలీనం చేయడానికి ఈ బహిరంగ సభ జరుగుతుందని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గం ఇంకా ఆంధ్ర వలసవాదుల కబ్జాలోనే ఉందన్నారు. 2008లో తుమ్మిడిహట్టి దగ్గర అప్పటి సిఎం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో భూములు లాక్కొని, కొందరికి పరిహారం కూడా ఇవ్వకుండా 1500 కోట్లు ఖర్చుచేసారు. ఆ కాంట్రాక్టు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఇచ్చారని గుర్తుచేశారు. పైగా ప్రాజెక్టు నిలిపివేసి కమీషన్ల కోసం రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 82వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆంధ్రవారికే అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికి కూడా క్రషర్లు,కంకర క్వారీలు పెట్టి,రోడ్ల కాంట్రాక్టుల పేరుతో 50 కోట్లు ఆంధ్రకు చెందిన వల్లభనేని కన్స్ట్రక్షన్స్ కి అప్పజెప్పారని విమర్శించారు.
ఆంధ్ర నుండి వచ్చిన దోపిడీ పాలకులు తెలంగాణ బహుజన బిడ్డలను చంపుతామని బెదిరిస్తున్నాడంటే ఇంకా తెలంగాణ రాలేదని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములను లాక్కోవడానికే ధరణి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
పుంగనూరులో నాపై పోటికి సిద్దమా: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్
తిరుపతి : చంద్రబాబు విమర్శలకు ఘాటుగా స్పందించిన ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చి పదేపదే నా గురించి మాట్లాడుతున్నారు..
మేము ప్రజల కోసం పని చేస్తున్నాం..
చంద్రబాబు లాగా సొంత మనుషుల కోసం కాదు..
చంద్రబాబు కారు కూతలు కూస్తున్నారు..
రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు జెండాను పీకేస్తాం..
మా పక్షాన ప్రజలు ఉన్నంత కాలం మా పని అయిపోదు..
జిల్లాలో మాపై పై చెయ్యి సాధించడం నీ బాబు తరం కుడా కాదు..
చంద్రబాబు తన మానసిక పరిస్థితి ఎలా వుందో ఒకసారి వైద్యులను కలిసి చూపిస్తే మంచిది..
కుప్పంలో నీ పరిస్థితి ఎంటో నేను చూస్తాను..
నువ్వు పుంగనూరులో చేసేది ఏముంది..
కుప్పంలో నీ జెండాను శాశ్వతం పీకేసే రోజులు దగ్గరలో ఉన్నాయి..
నీ జెండా మోయమని పవన్ కు టిడిపి జెండా అప్పగించావు..
కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కుడా కష్టమే..
కుప్పంలో చంద్రబాబుపై పోటికి సీఎం జగన్ అదేశిస్తే నేను సిద్దం..
పుంగనూరులో నాపై చంద్రబాబు పోటికి సిద్దామా..!
రెండు చోట్లా పోటికి నేను సై..
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపిమంత్రి-
ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలు దర్శించనున్న పవన్ కళ్యాణ్. తన ప్రచార వాహనం వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు.
- అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు చేరుకున్న చంద్రబాబు నాయుడు
- భారీగా చేరుకున్నకార్యకర్తలు, టీడీపీ శ్రేణులు
- కార్యకర్తల్ని పరామర్శించడానికి సబ్ జైల్లోకి వెళ్లిన చంద్రబాబు
- పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు, అభిమానులు
బీసీ సంక్షేమ, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల మరణించారు. కరీంనగర్ లో సోమవారం ద్వాదశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి, గంగుల మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మంత్రి గంగులను , కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్, తెలంగాణ ఎమ్మెల్యే హనుమంతు షిండే, మాజీ ఈవో కృష్ణయ్యలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఏలూరు జిల్లా పోలవరంలో సంక్రాంతి పండగ పూట విషాదం జరిగింది. పోలవరం మండలం గుటాల సమీపంలో ఏటి గట్టుపై ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 లో రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ కు చెందిన సందీప్ రెడ్డి, శరత్ నాయక్ గా పోలీసులు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టును చూసి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గోదావరి జిల్లాల ప్రాంతాల పర్యటనకు ఐదుగురు స్నేహితుల బృందం వచ్చింది.
స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జనవరి 16 నుండి 20వ తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిక్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారికి జ్యూరిక్ విమానాశ్రయంలో ఎన్నారైలు భారీ ఎత్తున స్వాగతం పలికారు.
జ్యూరిక్ నగరంలోనే కాక, స్విట్జర్‌లాండ్‌లోని ఇతర నగరాలు, యూరోప్‌లోని ఇతర దేశాల నుండి వచ్చిన ఎన్నారైలు విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో స్విట్జర్‌లాండ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు శ్రీధర్ గండె, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఇవ్వాళ సాయంత్రం జ్యూరిక్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన "మీట్ ఎండ్ గ్రీట్" కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. నేడు డావోస్ చేరుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు.
- విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో కలకలం
- కేసుల్లో పట్టుబడిన వాహనాలకు నిప్పు
- స్టేషన్ వెనుక వైపు ఖాళీ స్థలంలో పార్క్ చేసిన వాహనాలు
- 20 వరకు టూ వీలర్లు పూర్తిగా దగ్ధం.. మరో 10 టూ వీలర్లు, నాలుగు ఫోర్ వీలర్ లు పాక్షికంగా దగ్ధం
- రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
- పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడంతో ఆ నిప్పు వాహనాలకి అంటుకునే ఉంటుందని అనుమానం
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిసిపి ఆనందరెడ్డి
- మరికొద్ది సేపట్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్న డిసిపి
నేడు కరీంనగర్‌లో జరగనున్న మంత్రి గంగుల కమలాకర్ తండ్రి 11వ వర్ధంతి రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. కరీంనగర్ నగరంలోని కొండా సత్యలక్ష్మి గార్డెన్ లో వర్థంతి కార్యక్రమం జరగనుండగా అక్కడికి సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకోనున్నారు.
Background
ఏపీ, యానాం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. క్రిష్ణా, గుంటూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.
ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. సోమవారం (జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్ స్పెల్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్ స్పెల్‌లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి.
రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.
హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 31.8 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 071 శాతంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -