Breaking News Live Telugu Updates: కాకినాడ జిల్లాలో విషాదం, నిమజ్జనానికి వెళ్లి ముగ్గురు గల్లంతు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 11 Sep 2022 10:10 PM
కాకినాడ జిల్లాలో విషాదం, నిమజ్జనానికి వెళ్లి ముగ్గురు గల్లంతు 

కాకినాడ జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు.  ఒక యువకుడు మృతి చెందా, ఇద్దరు గల్లంతు అయ్యారు. కొత్తపల్లి (మం)  అమీనాబాద్ మినీ హార్బర్ వద్ద  సముద్రతీరంలో ఈ  ఘటన చోటుచేసుకుంది. నాగులపల్లికి చెందిన యువకులు నిమజ్జనం చేస్తుండగా  రాకాసి అలల్లో కొట్టుకుపోయారు. స్థానిక మత్య్సకారులు స్పందించి ఇద్దరిని  కాపాడారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు అన్నిశేట్టి వెంకటేష్ రెడ్డి మృతిచెందినట్లు ఏఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదస్థలాన్ని ఆయన పరిశీలించారు. 

సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం 

Manisharma Mother : ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి(88) కన్నుమూశారు. ఆదివారం ఆమె చనిపోయారు. ఆమె చెన్నైలో మణిశర్మ సోదరుడి వద్ద ఉంటున్నారు.  

TG Venkatesh: కృష్ణంరాజు మృతి పట్ల టీజీ వెంకటేష్ సంతాపం

ప్రముఖ సినీ నటుడు మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతి పట్ల మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మృతి పట్ల కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ‘‘కృష్ణంరాజు మృతి సినీ రంగానికి రాజకీయ రంగానికి తీరని లోటు.  సినిమా రంగానికి, సమాజానికి ఎంతో విలువలతో కూడినటువంటి సేవలందించినటువంటి వ్యక్తి కృష్ణంరాజు. పార్టీ సీనియర్ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా ఆయన భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు అందించారు. జాతీయస్థాయి రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేకుండా చురుకైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కృష్ణంరాజు.’’ అని టీజీ వెంకటేష్ గుర్తు చేసుకున్నారు.

KamaReddy News: జుక్కల్ లో భారీ వర్షం... నిజాం సాగర్ గ్రామానికి నిలిచిన రాకపోకలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ లో భారీ వర్షం... నిజాంసాగర్ ప్రాజెక్టు కు  పోటెత్తిన వరద 
8 గేట్ ద్వార వరద ను దిగువకు వదులుతున్న అధికారులు 
నిజాo సాగర్ ప్రాజెక్ట్ కు భారీ వరద వస్తోంది. ప్రాజెక్ట్ క్యాచ్ మెoట్ ఏరియాతో పాటు ఎగువ కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్ట్ కు వరద భారీగా వస్తోంది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి వరద విడుదల చేస్తుండటంతో నిజామ్ సాగర్ కు వరద వస్తోంది. ప్రాజెక్ట్ లోకి 56,000 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఔట్ ఫ్లో 80,800 క్యూసెక్కులు దిగువకు వదులు తున్నారు. ప్రధాన కాల్వ ద్వారా 600 క్యూసెక్కులు, రెగ్యులేటర్ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు ప్రస్తుతం 1404.90 అడుగులుగా ఉంది. నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.658 టీఎంసీలుగా ఉంది. వరద భారీగా రావటంతో  ప్రాజెక్టు దిగువన రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో నిజామ్ సాగర్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

VRA Suicide: మిర్యాలగూడ (మం) ఉట్లపల్లిలో భారీగా మోహరించిన పోలీసులు

నల్గొండ : మిర్యాలగూడ (మం) ఉట్లపల్లి గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు... 
శనివారం ఆర్ధిక ఇబ్బందులతో వీఆర్ఏ వెంకటేశ్వర్లు ఆత్మహత్య.... 
ఘటనకు ప్రభుత్వమే భాధ్యత వహించాలంటూ వీఆర్ఏల ఆందోళన.... 
పెద్ద ఎత్తున ఉట్లపల్లికి చేరుకుంటున్న వీఆర్ఏలు... 
గ్రామంలో పలుచోట్ల చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వీఆర్ఏలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు....

Godavari Level At Bhadrachalam: భారీగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం..

భద్రాద్రి జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమ క్రమంగా పెరుగుతున్నది. గత మూడు రోజులుగా ఎగువ మరియు లోతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి మరోసారి ఉగ్రరూపం దాలుస్తుంది. ఇప్పటికే ఏటూరు నాగారం వద్ద రెండోవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. సోమవారం ఉదయం వరకు గోదావరి 45 అడుగులు చేరుకునే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో వరద అందితే భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరగనున్నది.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో విషాదఛాయలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన స్వగ్రామం మొగల్తూరు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన సొంత ఇంటి వద్ద ఆయన కుటుంబీకులు, బంధువులు కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Krishnam Raju: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు - కేసీఆర్ నిర్ణయం

కృష్ణంరాజు చనిపోయిన వేళ ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్‌ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఆ మేరకు సీఎం కింది స్థాయి అధికారులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు.

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గొల్ల బాబురావు, గిరిధర్ రావు, ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి, ప్రభుత్వ విప్ లు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, సామాన్య భక్తులకు టీటీడీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డికి పాలనపరంగా స్వామి వారి దీవెనలు ఉండాలని, ఏపీలో అద్భుతమైన పాలన కొనసాగుతుంటే ప్రతిపక్షాలు ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఒక మంచి పథకాన్ని అమలు చేయలేక పోయారన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఏపీ సీఎం పథకాలు అమలు చేయడంతో దేశం అంతా ఏపీ వైపు చూస్తుందన్నారు. కొత్త పథకాలు కూడా ప్రజల ముందుకు తీసుకుని వస్తున్నారని, ప్రజలంతా వైసీపీ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ విప్ శ్రీనివాసులు అన్నారు.

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం, కొట్టుకుపోయిన కారు - ఇద్దరు దుర్మరణం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా వేములవాడ మండలం, ఫాజుల్ నగర్ దగ్గర ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు సురక్షితంగా బయటకు వచ్చారు. జేసీబీ సహాయంతో పోలీసులు కారును బయటకు తీశారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Background

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం సూచన ప్రకారం.. మరో రెండు నుంచి మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుని  తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది.


తెలంగాణలో వర్షాలు 
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 13 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న (సెప్టెంబర్ 10న) పలు జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.


నేడు సెప్టెంబర్ 11న భారీ వర్ష సూచనతో ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. ఉత్తర, పశ్చిమ దిశల నుంచి గంటకు 8 నుంచి 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.  


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో విస్తారంగా వర్షాలు పడతాయి. మిగతా చోట్ల చల్లని గాలులు వేగంగా వీస్తాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొర్లిపోతుంటే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్ష సూచనతో గుంటూరు, ప్రకాశం క్రిష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.