Tirumala News: తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన దుర్ఘటనకు మనస్ఫూర్తిగా యావత్ జాతికి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారని వెల్లడించారు. ఇలాంటివి జరకుండా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పవన్ స్విమ్స్‌ వచ్చిన టైంలోనే జగన్ రావడంతో కాసేపు హైడ్రామా నడిచింది.  


టీటీడీ బాధ్యత తీసుకోవాలి: పవన్ కల్యాణ్


అంతేకాకుండా టీటీడీ బోర్డు కచ్చితంగా ఈ దుర్ఘటనకు బాధ్యత తీసుకోవాలని సూచించారు పవన్ కల్యాణ్. ఎందుకు పోలీసులు సకాలంలో స్పందించలేదో తేలాలని అన్నారు. ఎప్పుడో ఇవ్వాల్సిన టికెట్ల కోసం ప్రజలను ఎందుకు నిల్చోబెట్టారో విచారణ చేయాలన్నారు. ఎందుకు లైట్‌లు బిగంచలేదని ప్రశ్నించారు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అందుకే అధికారులు, టీటీడీ అధికారులుక, టీటీడీ పాలకమండలి, ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలి. వీఐపీ యాటిట్యూడ్ మానేయండి. ఆలయాల్లో వీఐపీ కల్చర్ పెరిగిపోయిందని అందరూ చెబుతున్నారు. మనకు కావాల్సింది వీఐపీ ఫోకస్ కాదు. సామాన్యుడు భక్తులు వచ్చి క్షేమంగా ఇంటికి చేరేలా ఏం చర్యలు తీసుకుంటున్నారు. ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా ఈవో, ఏఈవో, పాలక మండలి, ఛైర్మన్ మేల్కొని ఇలాంటివి జరగకుండా చూడాలి. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని టీటీడీ, పోలీసులు వెళ్లి పరామర్శించాలి. 


Also Read: ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!


క్షతగాత్రులకు నయం అయ్యాక దైవ దర్శనం 


క్షతగాత్రులను తాను పరామర్శించి ధైర్యం చెప్పానన్నారు పవన్ కల్యాణ్. జరిగిన దుర్ఘటనపై క్షమించాలని కోరానన్నారు. వారికి పూర్తిగా నయం అయ్యాక తిరులేశుడి దర్శనానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. తీసుకొచ్చి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళఅలీ ఇంటి వద్దకు చేరుస్తారని చెప్పారు. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇలాంటివి రిపీట్ కాకూడదన్న పవన్... ఆలయాల్లో వీఐపీ ట్రీట్మెంట్‌ ఆగిపోవాలని ఆకాంక్షించారు. సామాన్యుడికే ప్రాధాన్యత పెరగాలని కోరుకున్నారు.  


స్విమ్స్‌ వద్ద హైడ్రామా 


స్విమ్స్‌ నుంచి పవన్ కల్యాణ్ వస్తున్న టైంలోనే జగన్ కూడా అటుగా వచ్చారు. ఆ సందర్భంలో పవన్ చూసిన వైసీపీ శ్రేణులు జై జగన్, సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పవన్ కల్యాణ్‌ మైక్ అందుకొని వారిని కంట్రోల్ చేశారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఆనందించే సమయమా లేకుంటే బాధపడే సమయమా అని ప్రశ్నించారు. జరగరాని ఘటన జరిగినా ఇంకా పోలీసులు మారలేదని అన్నారు. ఇలాంటి వారిని అక్కడి నుంచి క్లియర్ చేయాలని మైక్‌లో గట్టిగట్టిగా అరుస్తూ చెప్పారు. వైసీపీ శ్రేణులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇంకా పాఠాలు నేర్చుకోకుంటే ఎలా అంటూ మీడియా ముఖంగానే ప్రశ్నించారు.  


Also Read: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు