తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అమలుచేస్తున్న పథకం కల్యాణ లక్ష్మీ. అయితే ఇందులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా అయితే ప్రభుత్వ పథకం పొందాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అసలు దరఖాస్తు చేయకుండానే.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్.. డబ్బులు వస్తున్నాయి. అది కూడా.. ఎప్పుడు 40, 50 ఏళ్ల కిందట... పెళ్లైన వృద్ధుల్లో ఖాతాల్లో వచ్చి పడుతున్నాయి.  


ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడో పెళ్లైన.. ముగ్గురు వృద్ధులకు కల్యాణలక్ష్మీ పథకం కింద డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యాయి. సిరికొండ మండలానికి చెందిన 67 ఏళ్ల శకుంతలబాయి అనే మహిళకు రెండుసార్లు, 65 ఏళ్ల సుమన్‌బాయి అనే మహిళకు మూడుసార్లు వారి బ్యాంకు ఖాతాలో కల్యాణ లక్ష్మీ ఆర్థిక సాయం పడింది. ఇచ్చోడ మండలం చించోలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల గంగుబాయి అనే మహిళకు రెండుసార్లు పథకం కింద డబ్బులు వచ్చాయి. గంగుబాయి భర్త చనిపోయి.. పదేళ్లు అవుతుంది. 


ఇలా వృద్ధుల ఖాతాల్లోకి సొమ్ము వచ్చి పడటం.. సాంకేతిక పొరపాటు కానే కాదని.. ఆరోపణలు ఉన్నాయ. కొంతమంది అధికారులు.. కావాలనే.. నిధులను ఇలా దారి మళ్లిస్తు్న్నారని తెలుస్తోంది. కొంతమంది నకిలీ లబ్ధిదారుల పేరుతో.. ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఏటా రూ.2వేల కోట్ల వరకు ఈ పథకానికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. సక్రమంగా ఉపయోగించాల్సిన నిధులను ఇలా దారి మళ్లించడంపై.. పలువురు మండిపడుతున్నారు.


Also Read: Covid Vaccination: 'మోదీ ఫొటో ఉంటే తప్పేంటి? 100 కోట్ల మందికి లేని బాధ మీకెందుకు?'


Also Read: Kashi Vishwanath Corridor: సామాన్యుడికి మోదీ సర్‌ప్రైజ్.. కారు ఆపి బహుమతి తీసుకున్న ప్రధాని


Also Read: Vladimir Putin: మోదీ ఛాయ్‌వాలా అయితే ఆయన టాక్సీవాలా.. నమ్మకం లేదా మీరే చూడండి!


Also Read: Omicron Virus Death: ఒమిక్రాన్ వేట మొదలైంది.. తొలి మరణం నమోదు.. ప్రధాని ప్రకటన!


Also Read: Sukesh Chandrashekhar Case: జాక్వెలిన్‌కు బిగుస్తోన్న ఈడీ ఉచ్చు.. బహుమతుల లిస్ట్ ఇదే!


Also Read: Omicron Variant: ఒమిక్రాన్ సినిమా చూపిస్తుందట.. 75 వేల మరణాలు.. నిపుణుల హెచ్చరిక!


 Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు