షియోమీ 11ఐ హైపర్ చార్జ్ స్మార్ట్ ఫోన్ ధరని మనదేశంలో టీజ్ చేశారు. ఈ కొత్త షియోమీ ఫోన్ మనదేశంలోనే ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్ ఫోన్ అని కంపెనీ ప్రకటించింది. ఇది 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది. గతంలో విడుదల అయిన టీజర్ల ప్రకారం.. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఈ ఫోన్ ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్యలో ఉండే అవకాశం ఉందని కంపెనీ అధికారులు తెలిపారు. చైనాలో గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ ధర కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మిగతా వివరాలు తెలియరాలేదు.
అప్‌డేటెడ్ మైక్రోసైట్ ప్రకారం.. షియోమీ 11ఐ హైపర్ చార్జ్ మూడు రంగుల్లో లాంచ్ కానుంది. కామో గ్రీన్, పసిఫిక్ పెరల్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్‌గా ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 120W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించారు. ఇది కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ కానుంది. ఈ ఫోన్ ప్రధాన సెల్లింగ్ పాయింట్ ఇదే. షియోమీ 11ఐ హైపర్ చార్జ్‌తో పాటు షియోమీ 11ఐ కూడా మనదేశంలో లాంచ్ కానుంది. ఇది చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 ప్రోకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉంది.
షియోమీ 11ఐ సిరీస్ మనదేశంలో జనవరి 6వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?