Twitter Video Audio call feature: ట్విట్టర్‌లో ఆడియా, వీడియో కాల్స్ ఫీచర్లు రానున్నాయని చాలా కాలం నుంచి మార్కెట్లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇది ఎలా ఉంటుందో అని దీనిపై మంచి హైప్ కూడా జనరేట్ అయింది. చివరకు కంపెనీ ఆ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ప్రారంభించింది.


దశల వారీగా అందుబాటులోకి
వినియోగదారులందరికీ దశల వారీగా ఇది అందుబాటులోకి వస్తుంది. ఆగస్ట్‌లో కంపెనీ సీఈవో లిండా యాకారినో ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని, ప్రజలు నంబర్‌ను షేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చని ధృవీకరించారు.


ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, CNBCతో మాట్లాడుతున్నప్పుడు ఈ కొత్త ఫీచర్ DM అంటే డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుందని, అలాగే వినియోగదారులు స్పామ్ కాల్స్‌కు భయపడాల్సిన అవసరం లేదని, దీనిపై కంపెనీ కొన్ని పరిమితులను కూడా విధిస్తుందని చెప్పారు.


స్పామ్ కాల్స్‌ను నివారించడానికి మూడు ఆప్షన్లు
ట్విట్టర్ ఆడియో, వీడియో కాల్ ఫీచర్ అప్‌డేట్‌ను ఎలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆడియో, వీడియో కాల్ ఫీచర్‌ను ఆన్ చేయడానికి, మీరు ముందుగా సెట్టింగ్‌లకు వెళ్లి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు డైరెక్ట్ మెసేజ్‌పై క్లిక్ చేసి, ఆడియో, వీడియో కాలింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి.


ఈ ఫీచర్ మీ ఖాతాకు లైవ్ అయితే అది మీకు కూడా కనిపిస్తుంది. లేకుంటే మీరు మరికొంత కాలం వేచి ఉండాలి. ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన వెంటనే, మీకు ఎవరు కాల్ చేయవచ్చో కూడా సెట్ చేసుకోవచ్చు. ఆడియో, వీడియో కాల్స్‌ను కాంటాక్ట్స్‌కు లేదా మీరు ఫాలో అయ్యే యూజర్లకు లేదా వెరిపైడ్ యూజర్లకు మాత్రమే పరిమితం చేయవచ్చు.


వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో ఇంటర్‌ఫేస్
ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్ ఫీచర్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే ఉంటుంది. అంటే దాని ఇంటర్‌ఫేస్ దాదాపు ఒకేలా ఉంటుంది. మీరు పైభాగంలో కుడి వైపు ఆడియో, వీడియో కాల్ ఆప్షన్‌ను పొందుతారు.


ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్ బోలెడన్ని మార్పులు చేశారు. ట్విట్టర్ ఉన్నప్పుడు అందులో చేసే పోస్టును ట్వీట్ అనే వారు. ఇప్పుడు దాన్ని ‘పోస్టు’ అంటున్నారు. అలాగే రీట్వీట్‌ను రీపోస్ట్‌గానూ, కోటెడ్ ట్వీట్‌ను ‘కోట్స్’గానూ మార్చేశారు. ట్విట్టర్‌కు పోటీగా మెటా కూడా థ్రెడ్స్ అనే యాప్‌ను జులై నెల 6వ తేదీన లాంచ్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే థ్రెడ్స్ యాప్ ఏకంగా 100 మిలియన్ల యూజర్ మార్కును అందుకుంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial