యాపిల్ వాచ్ సిరీస్ 9ను యాపిల్ త‌న ‘వండర్‌లస్ట్’ ఈవెంట్లో లాంచ్ చేసింది. 2015లో యాపిల్ మొట్ట‌మొద‌టి వాచ్ ను లాంచ్ చేయ‌గా, ఇది ఆ సిరీస్‌లో 10వ వాచ్. ఈ వాచ్‌లో జీపీఎస్, సెల్యులార్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.


యాపిల్ వాచ్ 9 సిరీస్ ధ‌ర‌
యాపిల్ వాచ్ సిరీస్ 9 ధర మనదేశంలో రూ.41,900 నుంచి ప్రారంభం కానుంది. అమెరికాలో 399 డాల‌ర్ల (మ‌న‌దేశ క‌రెన్సీలో సుమారు రూ.33,000) నుంచి దీని ధర ప్రారంభం కానుంది. మిడ్ నైట్, స్టార్ లైట్, పింక్ (కొత్త కలర్), సిల్వర్, ప్రొడ‌క్ట్ రెడ్ రంగుల్లో ఈ వాచ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.


యాపిల్ వాచ్ 9 సిరీస్ స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు
యాపిల్ వాచ్ సిరీస్ 9లో 41 మిల్లీమీటర్లు, 45 మిల్లీమీటర్ల ఆప్షన్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ 7,8 తరహాలోనే ఇందులో కూడా ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్‌గా ఉండనుంది.  ఒక్క‌సారి చార్జ్ చేస్తే 18 గంట‌ల పాటు ఈ వాచ్ సిరీస్ 9 ప‌నిచేయ‌నుంది. ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ కూడా ఈ వాచ్ సిరీస్‌లో అందించారు.


కొత్త యాపిల్ ఎస్9 ఎస్ఐపీ (సిస్టం ఇన్ ప్యాకేజ్) ఉన్న సెకండ్ జనరేషన్  అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్‌సెట్‌తో ఈ వాచ్ సిరీస్ లాంచ్ అయింది. యాపిల్ వాచ్ సిరీస్ 8 కంటే 60 శాతం వేగంగా సిరీస్ 9 పని చేయనుందని కంపెనీ పేర్కొంది. హెల్త్ డేటాను సిరి ద్వారా యాక్సెస్ చేసే ఫీచర్ కూడా ఇందులో అందించారు.


ఈ వాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటంటే... డబుల్ ట్యాప్ జెస్చర్ ఫీచర్. దీని ద్వారా యూజర్లు కాల్స్ ఆన్సర్ చేయవచ్చు. ఎండ్ చేయవచ్చు. టైమర్ స్టాప్ చేయడం, అలారం ఆపడం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం, కెమెరా యాక్సెస్ చేయడం వంటి పనులు కూడా చేయవచ్చు. 


వాచ్ ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ వాచ్ పని చేయనుంది. ఇందులో ఎన్నో ముఖ్య‌మైన హెల్త్, ఫిట్ నెస్ ఫీచ‌ర్లు కూడా ఇందులో అందించారు. హైకింగ్, సైక్లింగ్ ఫీచర్లు కూడా అందించారు. మెంటల్ హెల్త్ సపోర్ట్ టూల్స్ కూడా ఉన్నాయి. యాపిల్ లాంచ్ చేసిన మొట్టమొదటి కార్బన్ న్యూరల్ ప్రొడక్ట్ ఇదే. ఇంతకు ముందు వెర్షన్‌తో పోలిస్తే ఎన్నో మార్పులను యాపిల్ చేసింది. ముందు వెర్షన్ కంటే మెరుగైన మోడల్‌ను కోరుకునే వారిని ఈ వాచ్ అస్సలు డిజప్పాయింట్ చేయదు. పైన పేర్కొన్న జెస్చర్ ఫీచర్ ఇందులో ప్రధాన హైలెట్.


Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial