పిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్ని స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. ఎన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నా, ఐఫోన్ అంటే ఐఫోనే. కొత్త ఐఫోన్ కొనాలంటే ఖరీదు బాగా ఎక్కువ కావడంతో చాలా మంది సెకెండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే, సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం..


కొనుగోలు రశీదు: సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనాలి అనుకునే వారు కచ్చితంగా సదరు ఫోన్ కు సంబంధించిన కొనుగోలు రశీదును పరిశీలించాలి. ఒక్కోసారి దొంగతనం చేసిన ఫోన్లు కొని చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఫోనుకు సంబంధించిన కొనుగోలు రశీదును గమనించాలి.


IMEI నంబర్: స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు చూపించిన రశీదుతో సరిపోలుతున్నాయో? లేదో? గమనించాలి. ఇందుకోసం IMEI నంబర్‌ ని పరిశీలించాలి.   


సీరియల్ నంబర్: ఆపిల్ వారంటీ ధృవీకరణ కోసం IMEI నంబర్‌లతో పాటు దాని అన్ని ఉత్పత్తులకు సీరియల్ నంబర్లను కేటాయిస్తుంది.  ఈ నేపథ్యంలో కొనుగోలు చేయబోయే ఫోన్ సీరియల్ నెంబర్ ను పరిశీలించడం మంచిది.  


IPhone పార్ట్స్ పరిశీలన: గాడ్జెట్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో ముందే చెక్ చేసుకోవాలి.  సదరు ఐఫోన్ లోని పార్ట్స్ ఆపిల్ కంపెనీకి సంబంధించినవా? కావా? అని పరిశీలించాలి.  


SIM ట్రే పరిశీలన: SIM ట్రేని తీసి బెండింగ్ లేదంటే వాటర్ డ్యామేజ్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలి.


సెకండ్ హ్యాండ్ ఐఫోన్ అసలైనదో కాదో ఎలా తెలుస్తుంది?


మీరు కొనుగోలు చేయబోయే ఐఫో అసలైనదో కాదో ముందుగా చెక్ చేయాలి. ఇందుకోసం సెట్టింగ్‌లు > జనరల్ > ఎబౌట్ ఓపెన్ చేసి ‘మోడల్ నంబర్’ ఎంట్రీని చూడాలి. ఈ సంఖ్య Fతో ప్రారంభమైతే Apple కంపెనీకి చెందినదిగా గుర్తించవచ్చు.


సెకెండ్ హ్యాండ్ iPhoneని ఎలా పరీక్షించాలి?


1. ముందుగాIMEI నంబర్‌ని తనిఖీ చేయాలి.


2. యాక్టివేషన్ లాక్‌ని వెరిఫై చేయాలి.


3. iPhoneని రీస్టార్ట్ చేయాలి.   


4. వారంటీని వెరిఫై చేయాలి.


ప్రీ-ఓన్డ్ ఐఫోన్‌ కొనుగోలు చేయడం సురక్షితమేనా?


కొంతమంది కస్టమర్‌లు ఉపయోగించిన ఫోన్ ను కొనుగోలు చేయడం మంచిది కాదు. కానీ, మీరు మీ iPhone కొనుగోలుపై డబ్బు ఆదా చేయాలనుకుంటే, ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకొని కొనుగోలు చేయడం మంచిది.  


ఐఫోన్ బ్యాటరీని ఏది దెబ్బతీస్తుంది?


సిఫార్సు చేయబడిన బ్యాటరీ ఉష్ణోగ్రతలు మించిపోయిన సందర్భంలో, సాఫ్ట్‌ వేర్ 80% కంటే ఎక్కువ ఛార్జింగ్‌ను పరిమితం చేయవచ్చు. బ్యాటరీని వెచ్చని వాతావరణంలో ఉంచడం మంచిది కాదు. 'ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్' ఫీచర్ ద్వారా మీ ఐఫోన్‌లోని బ్యాటరీ జీవితాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.   


Read Also: ఐఫోన్ లవర్స్‌ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial