ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శోభు యార్లగడ్డ అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరితోనూ కఠిన వైఖరి కనబర్చరు. ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. వివాదాస్పద విషయాల జోలికి అస్సలు వెళ్లరు. కానీ, తనకు నచ్చని విషయాలను మాత్రం అప్పుడప్పుడు ఏమాత్రం వెనుకాడకుండా చెప్పేస్తారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఓ కామెంట్ సంచలనం కలిగిస్తోంది.


యంగ్ హీరోపై శోభు యార్లగడ్డ సీరియస్


ఓ యంగ్ హీరో గురించి శోభు సీరియస్ గా ఓ ట్వీట్ పెట్టారు. తన ఆటిట్యూడ్ కారణంగా ఓ మంచి సినిమాను చేజార్చుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో కాసేపట్లోనే దాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో శోభు ట్వీట్ పై నెటిజన్లలో సర్వత్రా ఆసక్తి చెలరేగింది. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు? అంటూ చర్చలు మొదలు పెట్టారు.


ఇంతకీ శోభు ట్వీట్ లో ఏం రాశారంటే?


“రీసెంట్ గా మంచి సక్సెస్ కొనసాగిస్తున్న ఓ యువ నటుడు తన ఆటిట్యూడ్ కారణంగా హిట్ సినిమాను చేజార్చుకున్నాడు. ఒక్కసారి సక్సెస్ వచ్చాక, దానిని చాలా జాగ్రత్తగా హ్యండిల్ చేయగలగాలి. లేదంటే, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ డెబ్యూ డైరెక్టర్ సదరు యంగ్ హీరోకు కథ చెప్పడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా తను చాలా ఆటిట్యూడ్ ప్రదర్శించాడు. సదరు దర్శకుడి పట్ల కనీస గౌరవం చూపించలేదు. ఇలాంటి పద్దతి అతడి సినీ కెరీర్ కు అస్సలు మంచిది కాదు. ఈ విషయం గురించి తను ఆలోచిస్తాడు అనుకుంటున్నాను. చేసిన పొరపాటు పట్ల చింతిస్తాడని భావిస్తున్నాను. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న వారిపట్ల గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. అప్పుడే, కెరీర్ బాగా బిల్డప్ అవుతుంది. ఇప్పటికైనా సదరు హీరో ఆటిట్యూడ్ మంచిది కాదని గుర్తిస్తాడని భావిస్తున్నాను” అని శోభు ట్వీట్ చేశారు. అయితే, ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు? అనేది విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.


ఆ యంగ్ హీరో విశ్వక్ సేనా?


శోభు యార్లగడ్ల చేసిన ట్వీట్ కచ్చితంగా యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించే అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఆయన గురించి గతంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును నెటిజన్లు ప్రస్తావించారు. అయితే, విశ్వక్ సేన్ కాదు అంటూ శోభు మరో ట్వీట్ చేశారు. ఇంతకు ఎవరు అనేది చెప్పాలని నెటిజన్లు శోభు యార్లగడ్డను కోరుతున్నారు. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచానికి చాటి చెప్పారు నిర్మాత శోభు యార్లగడ్డ.  






Read Also: మట్టితో బొమ్మలు, ఫ్రెండ్స్‌ తో సమంత సరదాలు- బాలిలో జాలీగా గడుపుతున్న సామ్


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial