కొంత కాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించిన అందాల తార సమంత, ప్రస్తుతం వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. తన ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాకు వెళ్లిన సమంత, ప్రస్తుతం బాలిలో ప్రకృతి అందాలను తిలకిస్తోంది. అక్కడి అద్భుత దృశ్యాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత
నిన్న మొన్నటి వరకు బీచుల్లో సరదాగా గడిపిన ఫోటోలను సమంత షేర్ చేసింది. అక్కడ ఎంతో హ్యాపీగా గడుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు అనుక్షణం ప్రకటిస్తున్నట్లు ఈ ఫోటోలు, వీడియోలను చూస్తుంటే అర్థం అవుతోంది. నచ్చిన ఆహారం తీసుకుంటూ, జిమ్ లో కష్టపడుతూ కనిపించింది. తన ఆరోగ్యం మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. తన ఫుడ్, జిమ్ వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా మట్టితో చక్కటి బొమ్మలను తయారు చేస్తూ కనిపించింది. తన ఫ్రెండ్స్ తో కలిసి చక్కటి కళాఖండాలను రూపొందిస్తోంది. బురద మట్టితో రకరకాల మొక్కలను తయారు చేసింది. ఇక ప్రకృతి అందాల నడుమ హాయిగా సేద తీరుతూ కనిపించింది. సూర్య రశ్మిని చూస్తూ కనిపించింది. చెక్క రూఫ్ లో జలపాతాన్ని దాటుతూ సరదాగా గడిపింది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పనులు చేస్తోంది. మొత్తంగా బాలి వెకేషన్ లో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.
ఆరోగ్య సమస్యలతో సినిమాలకు బ్రేక్
కొద్ది రోజుల క్రితం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు సమంతా ప్రకటించింది. సుమారు ఏడాది పాటు సినిమాలు చేయట్లేదని వెల్లడించింది. కొద్ది సంవత్సరాలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె, చికిత్స తీసుకుంటూనే సినిమాలు చేసింది. అయితే, ‘శాకుంతలం’ మూవీ డిజాస్టర్ తర్వాత కొద్ది కాలం సినిమాలకు విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలు పూర్తి స్థాయిలో నయం అయ్యేందుకు అమెరికాలో చికిత్స తీసుకోనున్నట్లు ప్రకటించింది. సైన్ చేసిన సినిమాలను దాదాపు పూర్తి చేసింది. కొన్ని సినిమాలకు ఓకే చెప్పినా, షూటింగ్ మొదలుకాని వాటి నుంచి తప్పుకుంది. ఈ మేరకు తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి ఇచ్చేసింది. ప్రస్తుతం మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు బాలిలో వెకేషన్ గడుపుతోంది.
సెప్టెంబర్ 1న ‘ఖుషి’ మూవీ విడుదల
సమంత సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే సినిమా చేసింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫోటోలు, పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ‘సిటాడెల్’ ఇండియా వెర్షన్ వెబ్ సిరీస్ లోనూ సమంతా కనిపించనుంది. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
Read Also: ఈ వారం కూడా చిన్న సినిమాల సందడే - థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial