సినీ పరిశ్రమలో హీరోయిన్స్ లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంట్రీ ఇచ్చినప్పుడు హీరోయిన్స్ క్రేజ్ పీక్స్‌లో ఉన్నా కూడా ఒక్క ఫ్లాప్ వస్తే చాలు.. ఆ క్రేజ్ అమాంతం కిందకి పడిపోతుంది. అంతే కాకుండా అయిదేళ్లకు మించి ఒకే రకమైన క్రేజ్‌ను మెయింటేయిన్ చేయడం హీరోయిన్స్‌కు కష్టమైన విషయమే. కానీ రోజులు మారిపోయాయి. హీరోయిన్స్ కెరీర్ స్పాన్ కూడా పెరిగిపోయింది. సీనియర్ హీరోల సరసన నటించడానికి సీనియర్ హీరోయిన్లే బెస్ట్ ఛాయిస్ అని అనుకుంటున్నారు. ఇలాంటి సమయాల్లో కూడా ఆఫర్లు దక్కించుకోవడానికి ఎవరి ప్లాన్స్ వారికి ఉన్నాయి. నోరా ఫతేహీ కూడా ఆఫర్ల కోసం అందుకున్న సలహా గురించి బయటపెట్టి అందరికీ షాకిచ్చింది.


ఆఫర్లు కరువయ్యాయి..!


నోరా ఫతేహి.. తనను ప్రేక్షకులు హీరోయిన్‌గా కంటే డ్యాన్సర్‌గానే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. సన్నటి నడుముతో తను చేసే డ్యాన్స్ స్టెప్పులకు యూత్ ఎప్పుడో ఫిదా అయిపోయారు. అందుకే నటిగా కంటే డ్యాన్సర్‌గానే తను ఎక్కువగా ఆఫర్లు అందుకుంటూ ముందుకెళ్తోంది. తన డ్యాన్స్ కారణంగానే నోరాకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. కానీ ఈరోజుల్లో స్పెషల్‌గా వేరే నటితో డ్యాన్స్ పాటలకు స్టెప్పులు వేయించడం కంటే హీరోయిన్‌తోనే చేయిస్తే సరిపోతుంది కదా అని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే నోరాకు మాత్రమే కాదు.. తనలాంటి ఎంతోమంది డ్యాన్సర్లకు ఆఫర్లు తగ్గిపోతూ వస్తున్నాయి. 


‘బాహుబలి’ లాంటి సినిమాలో మనోహరి అంటూ యూత్‌ను ఒక ఊపు ఊపింది నోరా ఫతేహి. తెలుగులో తను చేసింది ఒక్క పాటే అయినా చాలామంది తెలుగు యువతను తన ఫ్యాన్స్‌గా మార్చుకుంది. ఇక హిందీలో నోరా చేసిన పాటలు పదుల సంఖ్యలో ఉంటాయి. వీటితో పాటు అప్పుడప్పుడు సినిమాల్లో నటిగా చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపించింది. ఇటీవల ముంబాయ్‌కు చెందిన ఒక బిజినెస్‌మ్యాన్‌తో నోరా సన్నిహిత సంబంధాల గురించి వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో మీడియాలో మరోసారి తన పేరు మారుమోగింది. అంతే కాకుండా ఆ బిజినెస్‌మ్యాన్‌తో కలిసి నోరా కూడా పలు క్రైమ్స్‌లో పాల్గొంది అంటూ తనపై కేసు కూడా నమోదయ్యింది. ఇప్పుడిప్పుడే ఆ కేసు నుంచి పూర్తిగా బయటపడి మళ్లీ కెరీర్‌‌పై ఫోకస్ పెట్టింది.


స్టార్ హీరోలతో డేట్


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరా ఫతేహి.. తన పీఆర్‌లు ఇచ్చిన సలహాల గురించి బయటపెట్టింది. తను సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన కొత్తలో స్టార్ హీరోలను డేట్ చేసి, ఎప్పుడూ వారి వెంటే ఉంటూ వార్తల్లో నిలిస్తే ఆఫర్లు వాటంతట అవే వస్తాయని తనకు తన పీఆర్‌లు సలహా ఇచ్చారని నోరా తెలిపింది. అంతే కాకుండా అలాంటి సలహాలను పట్టించుకోకుండా తాను ఈ స్థాయిలో ఉన్నానని, దాని వల్ల తన గురించి తాను చాలా గర్వపడుతున్నానని చెప్పింది. ప్రస్తుతం ఈ కెనడా భామ.. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వైరల్‌గా మారాయి. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరీ జంటగా నటిస్తున్న మట్కాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.


Also Read: విజయ్ సినిమాపై రజినీ ఓపెన్ కామెంట్స్ - మళ్లీ ఫ్యాన్ వార్ షురూ!