జులై నెలలో చాలా వరకు చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో చిన్న సినిమాల హవా కొనసాగింది. ఈ నెల చివరి వారంలోనూ పలు చిన్ని సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి.  


థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఇవే!


1. ఎల్‌జీఎం (తెలుగు) - ఆగస్టు 4


క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టారు. రీసెంట్ గా ధోని ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ నుంచి అతడి భార్య సాక్షి  నిర్మాతగా ‘ఎల్‌జీఎం’ చిత్రం తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు  రమేష్ తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్ కల్యాణ్, ఇవానా (లవ్ టుడే ఫేమ్), యోగి బాబు, మిర్చి విజయ్, నదియా సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 4న విడుదలకానుంది.


2. కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌ - ఆగస్టు 4


రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్`. శ్రీ తేజస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ ఆగ‌స్టు 4న  రిలీజ్ కానుంది.  


3. రాజుగారి కోడిపులావ్‌ - ఆగస్టు 4


AMF, కోన సినిమా బ్యానర్లు సంయుక్తంగా ‘రాజు గారి కోడిపులావ్’ సినిమాను నిర్మించాయి. ఈ సినిమా ద్వారా శివ కోన దర్శకుడిగా సినిమా పరిశ్రమకు  పరిచయం అవుతున్నారు. సినిమాలో  చాలా వరకు కొత్త నటులు ఉన్నారు.  బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


4. విక్రమ్‌ రాథోడ్‌ - ఆగస్టు 4


తమిళ నటుడు విజయ్‌ ఆంటోని తాజా చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’. బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన ‘తమిళరసన్‌’ తెలుగులో ‘విక్రమ్‌ రాథోడ్‌’గా రాబోతోంది. కౌసల్యరాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది.  ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 4 రిలీజ్ కానుంది.


5. మిస్టేక్‌ - ఆగస్టు 4


అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తున్న ‘మిస్టేక్’ మూవీ ఆగస్టు 4న విడుదలకాబోతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సన్నీ కొమ్మాలపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ASP బ్యానర్ పై ఈ  సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు రెడీ అయ్యింది.   
 
6. దిల్‌సే - ఆగస్టు 4


అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ‘దిల్‌ సే’. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.   


ఓటీటీలోసందడి చేసే సినిమాలు, సిరీస్‌లు ఇవే!


నెట్‌ఫ్లిక్స్‌
1 .చూనా (హిందీ వెబ్‌ సిరీస్‌) - ఆగస్టు 3
2. రంగబలి - ఆగస్టు 4
3. ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ (సిరీస్‌) - ఆగస్టు 4


హాట్‌ స్టార్‌
1. గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ3 - ఆగస్టు 2
2. దయా (తెలుగు సిరీస్‌)- ఆగస్టు 5


సోనీ లివ్‌
1. పరేషాన్‌ (తెలుగు) - ఆగస్టు
2. పోర్‌ తొడిల్‌ (తమిళం) - ఆగస్టు 4


Read Also: ‘కల్కి’పై కలవరం - ట్రోల్స్‌ను కూడా నాగ్ అశ్విన్ సీరియస్‌గా తీసుకుంటున్నారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial