ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD‘. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారతీయ సినీ అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి.  ప్రభాస్, దీపికా పదుకొణె ఫస్ట్ లుక్‌కు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, ఫస్ట్ గ్లింప్స్ పట్ల అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి మంచి రెస్పాన్స్  పొందింది. విఎఫ్‌ఎక్స్, టేకింగ్‌తో సహా అన్ని విషయాల పట్ల సినీ అభిమానులు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అయితే, నాగ్ అశ్విన్.. ట్రోల్స్‌ను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది. గ్లింప్స్‌పై పెట్టిన నెగటీవ్ కామెంట్స్‌ను కూడా పరిశీలనలోకి తీసుకుని.. భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పులేవీ లేకుండా చూడలని తమ టీమ్‌కు సూచిస్తున్నారట. ఇలా తప్పులు దిద్దుకుని ముందుకు సాగితే సక్సెస్ గ్యారంటీ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. మరి, ఈ విషయం బయటకు ఎలా లీకైందని అనుకుంటున్నారా? నిర్మాత ప్రియాంక దత్ ఇన్‌స్టా స్టోరీ వల్లే.


టీజర్ VFXను పరిశీలించిన నాగ్ అశ్విన్


తాజాగా ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ లేటెస్ట్ యాక్టివిటీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రియాంక దత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ స్టోరీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని అంశాల పట్ల మిశ్రమ స్పందన రావడంతో దర్శకుడు మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘కల్కి 2898 AD’ టీజర్ కు సంబంధించిన VFXను ఒకటికి పదిసార్లు రివ్యూ చేసుకుంటున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ మూవీస్ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే నాగ్ అశ్విన్ తన చిత్రంతో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ప్రియాంక అభిమానులతో పంచుకున్నారు.      


కామిక్‌ కాన్‌ ఈవెంట్ లో ఫస్ట్ గింప్స్ విడుదల


ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందుతోంది. రీసెంట్ గా ‘కల్కి 2898 AD‘ మూవీకి సంబంధించిన ఫస్ట్ గింప్స్ ను అమెరికాలో విడుదల చేశారు. ప్రఖ్యాత  శాండియాగో కామిక్‌ కాన్‌ ఈవెంట్ లో ఈ మూవీ గింప్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ‘కల్కి 2898 AD‘ చిత్రంపై హాలీవుడ్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అంతేకాదు, ఈ ప్రతిష్టాత్మక వేడుకలో మూవీ ప్రమోషనల్ వీడియోను లాంచ్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది.


‘కల్కి 2898 AD‘ విడుదల ఎప్పుడు?


ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది(2024) జవనరి 12న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే, ప్రస్తుతం విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేదు. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో కూడా రిలీజ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల చర్చలు జరుపుకుంటున్నారు. దర్శకుడు రాజమౌళి సైతం ఈ సినిమా విడుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   


Read Also: 'ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. సౌత్ హీరోలను చూసి నేర్చుకో రణ్‌వీర్‌'


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial