How to Boost up you Smartphone Performance: మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇది లేకపోతే జీవితమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. మనం రోజు అనేక పనులు నిలిచిపోవచ్చు. బిల్లు పేమెంట్స్ నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు దాదాపు అన్ని పనుల కోసం స్మార్ట్ ఫోన్‌పైనే ఆధారపడతాం. ఏదో ఒకవిధంగా ఈ గ్యాడ్జెట్ పాడైపోయినా లేదా స్లో అయినా అనేక సమస్యలు ఎదురవుతాయి. మీ స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు లేదా మీరు యాప్‌లను నిరంతరం రన్ చేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఫోన్ స్లో అవుతుంది. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే దాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
ఇలా ఫోన్ పనితీరును పెంచుకోండి
డేటా సేవర్ మోడ్: మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తుంటే, వెంటనే డేటా సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయండి. మీరు మీ బ్రౌజర్‌లో కూడా ఈ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. తద్వారా వెబ్‌పేజీలు కంప్రెస్ అవుతాయి. అలాగే మీ ఫోన్ కూడా వేగంగా పని చేయడం ప్రారంభిస్తుంది.
హోమ్ స్క్రీన్‌ను క్లీన్‌గా ఉంచండి: కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవడం లేదా యాప్‌లు లోడ్ కావడానికి చాలా సమయం పడుతుంది. దీనికి కారణం ఇన్‌స్టాల్ అయిన యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరంగా రన్ అవుతుండటం. మీరు చేయాల్సిందల్లా పని పూర్తయిన వెంటనే ఈ యాప్‌లను క్లోజ్ చేయడం, వాటిని బ్యాక్‌గ్రౌండ్ నుంచి తీసివేయడం ద్వారా ఫోన్ వేగంగా పని చేస్తుంది. ఇలా చేయకుంటే ఫోన్ పనితీరు స్లో అవుతుంది. దీంతో పాటు హోం స్క్రీన్‌ను కూడా క్లీన్‌గా ఉంచండి.
అలాగే ఒకేసారి ఎక్కువ యాప్‌లను ఓపెన్ చేయవద్దు. ముఖ్యంగా ర్యామ్ తక్కువగా ఉండే ఫోన్లలో ఎక్కువ యాప్స్ ఓపెన్ చేస్తే లోడ్ ఎక్కువ అవుతుంది. ఇలా చేయడం వల్ల చాలా యాప్స్ పని తీరు కోసం ప్రాసెసర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేయాల్సి వస్తుంది. దీని వల్ల ఫోన్ స్పీడ్ తగ్గుతుంది.
అనవసరమైన యాప్‌లను తొలగించండి: మనం రోజూ ఉపయోగించని యాప్‌లు మన ఫోన్‌లో చాలానే ఉన్నాయి. కొన్ని యాప్స్‌ను నెలల తరబడి ఓపెన్ చేయం. అటువంటి పరిస్థితిలో స్మార్ట్‌ఫోన్ వేగంగా పనిచేసేందుకు ఫోన్ నుంచి అలాంటి యాప్‌లను తీసివేయడం తెలివైన పని. జంక్ ఫైల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మన స్మార్ట్ ఫోన్ స్లో అవుతుంది. అందుకే వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉండాలి.
బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరంగా రన్ అయ్యే యాప్స్ ద్వారా ఫోన్ స్లో అవ్వడమే కాకుండా అది బ్యాటరీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రాసెసింగ్ మీద లోడ్ కోసం బ్యాటరీ వినియోగాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి వీటిని చేస్తే మీ బ్యాటరీ లైఫ్ కూడా మెరుగవుతుంది.
Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?
Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial