మీరు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తుంటే కచ్చితంగా గూగుల్ సెర్చ్‌ను వాడే ఉంటారు. అయితే సెర్చింజన్ అంటే కేవలం గూగులేనా? లేకపోతే మరే ఇతర బ్రౌజర్‌లను కూడా ఉపయోగించారా? గూగుల్ కాకుండా, ఇంటర్నెట్‌లో వినియోగదారులు ఉపయోగించే బ్రౌజర్‌లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక బ్రౌజర్‌లు మార్కెట్‌లో ఉన్నప్పటికీ, గూగుల్ ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో ఉంది. Relialsoft.net నివేదికల ప్రకారం బ్రౌజర్లలో గూగుల్ బ్రౌజర్ వాటా 92.57 శాతంగా ఉంది.
గూగుల్
ఇంటర్నెట్ సెర్చ్‌లో బ్రౌజర్‌గా గూగుల్ టాప్ ప్లేస్‌లో ఉంది. స్టాటిస్టా, స్టార్ కౌంటర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం గూగుల్ ఏ డివైస్‌లోనైనా (డెస్క్‌టాప్, మొబైల్, టాబ్లెట్) అన్ని దేశాలలో మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంది. వినియోగదారులకు అత్యంత ఖచ్చితమైన ఫలితాలను అందించడానికి గూగుల్ అధునాతన అల్గారిథమ్‌లను ఉపయోగిస్తోంది.
మైక్రోసాఫ్ట్ బింగ్
2020 అక్టోబర్‌లో బింగ్ పేరు మైక్రోసాఫ్ట్ బింగ్‌గా మార్చారు. గూగుల్ కంటే మైక్రోసాఫ్ట్ బింగ్ బలమైన సెర్చింజన్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సెర్చింజన్ మార్కెట్లో బింగ్ వాటా 2.83 శాతం నుంచి 12.31 శాతం వరకు ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఈ సెర్చింజన్ ద్వారా గూగుల్‌ను సవాలు చేయడానికి ప్రయత్నించింది. వికీపీడియా ప్రకారం ఇంటర్నెట్‌లో అత్యధికంగా సందర్శించే వెబ్ సైట్లలో బింగ్ 26వ స్థానంలో ఉంది.
యాహూ
యాహూ సెర్చింజన్ ఒక శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానంలో ఉంది. 2011 అక్టోబర్ నుంచి 2015 అక్టోబర్ వరకు యాహూ సెర్చ్‌ను ప్రత్యేకంగా బింగ్ ద్వారా అందించారు. వికీపీడియా ప్రకారం యాహూ వెబ్ పోర్టల్ చాలా ప్రజాదరణ పొందింది. ఇంటర్నెట్‌లో అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్‌లలో యాహూ 9వ స్థానంలో ఉంది.
బైదు
బైదు సెర్చింజన్ అంతర్జాతీయ మార్కెట్ వాటా 0.68 శాతం నుంచి 11.26 శాతం వరకు ఉంటుంది. బైదు బ్రౌజర్‌ను 2000లో స్థాపించారు. ఇది చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్. దీని మార్కెట్ వాటా పెరుగుతూనే ఉంది. వికీపీడియా ప్రకారం బైదు ప్రతి నెలా బిలియన్ల కొద్దీ సెర్చ్ రెస్పాన్స్‌లను అందిస్తుంది. Relialsoft.net కథనం ప్రకారం ఇది ప్రస్తుతం వికీపీడియా వెబ్‌సైట్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉంది. బైదు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నప్పటికీ, దీన్ని చైనీస్ భాషలో మాత్రమే ఉపయోగించగలం.
యాండెక్స్
యాండెక్స్ రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్. ఈ సెర్చ్ ఇంజిన్ వాటా ప్రపంచవ్యాప్తంగా 0.5 శాతం నుంచి 1.16 శాతం మధ్య ఉంది. వికీపీడియా ప్రకారం Yandex.ru ఇంటర్నెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 10 వెబ్‌సైట్లలో ఒకటి. రష్యన్ భాషలో ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. రష్యాలో Yandex సెర్చింజన్ వాటా 65 శాతంగా ఉంది.
డక్‌డక్‌గో
డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్ మార్కెట్ వాటా దాదాపు 0.66 శాతంగా ఉంది. డక్‌డక్‌గో గణాంకాల ప్రకారం వారు రోజుకు సగటున 90 మిలియన్లకు పైగా శోధనలను అందిస్తున్నారు. అయినప్పటికీ వారి మొత్తం మార్కెట్ వాటా స్థిరంగా 0.6 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ బ్రౌజర్ ముఖ్యాంశాలలో ఒకటి ఏమిటంటే ఇది క్లీన్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. వినియోగదారుల యాక్టివిటీని ట్రాక్ చేయదు. అలాగే యాడ్స్‌ను కూడా డిస్‌ప్లే చేయదు.
Read Also: ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial