ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మెరుగైన చాటింగ్ అనుభవాన్ని కలిగించేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను వినియోగదారుల ముందుకు తీసుకొస్తూనే ఉంది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు HD ఫోటోలను మాత్రమే పంపే ఫీచర్ ను పరిచయం చేసిన వాట్సాప్, ఇప్పుడు HD వీడియోలను సైతం పంపుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ప్రస్తుతం కొద్ది మంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే వాట్సాప్ వినియోగదారులు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


ప్రస్తుతం 720 పిక్సెల్ వీడియోలను పంపుకునే అవకాశం


వాస్తవానికి వాట్సాప్ లో ప్రస్తుతం ఏ వీడియో పంపుకోవాలన్నీ, ఆటోమేటిక్ గా 480 పిక్సెల్ కు కంప్రెస్ అవుతుంది. ఎంత క్వాలిటీ ఉన్నా, సెండ్ చేసే సమయంలో క్వాలిటీ తగ్గిపోతుంది. HD వీడియోలను ఆటోమేటిక్ గా పంపుకునే అవకాశం లేదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్ తో ప్రస్తుతం 720 పిక్సెల్ వీడియోలను పంపుకునే ఛాన్స్ ఉంది. గతంలో పోల్చితే మంచి క్వాలిటీ వీడియోలను పంపుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ త్వరలోనే మరింత క్వాలిటీ అంటే 1080 పిక్సెల్, 4K రెజల్యూషన్ వీడియోలను పంపేదానిపైనా వాట్సాప్ పరిశోధనలు చేస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.   


HD వీడియోలను ఎలా పంపాలంటే?


HD ఫోటోలను పంపుకునేందుకు HD ఫోటో ఫీచర్ మాదిరిగానే, హైక్వాలిటీ వీడియోలను పంపుకునేందుకు HD వీడియో ఫీచర్ అందుబాటులో ఉంది.


1.వాట్సాప్ లో HD వీడియోను పంపాలి అనుకునే వారు ముందుగా వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.


2.ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయాలి.


3.కాంటాక్ట్ లిస్టులోకి వెళ్లి ఎవరికి వీడియో పంపాలో వారికి వీడియో అటాచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి.


4.వీడియోను సెలెక్ట్ చేసుకోగానే HD అనే టోగుల్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.


5.ఇక 720 పిక్సెల్ HD క్వాలిటీతో వీడియోను పంపుకునే అవకాశం ఉంటుంది.    

ఇప్పటికే వాట్సాప్ పలు ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రీసెంట్ గా వాట్సాప్ లో ఫోటోలు, వీడియోలు, జిఫ్, డాక్యుమెంట్లకు సంబంధించి క్యాప్షన్లను ఛేంజ్ చేసుకునే ఫీచర్ ను పరిచయం చేసింది. అంతకు ముందు మెసేజ్ లను ఎడిట్ చేసుకునే అవకాశం కలిపించింది. అయితే, మెసేజ్ పంపిన 15 నిమిషాల లోపు మాత్రమే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. అంతేకాదు, షార్ట్ వీడియో రూపంలో రిప్లై ఇచ్చేలా, వాట్సాప్ వీడియో మెసేజ్ ఫీచర్ ను కూడా వాట్సాప్ ఇప్పటికే పరిచయం చేసింది. సో, ఎప్పటికప్పుడు వినియోగదారులకు మరింత మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది వాట్సాప్.  


Read Also: ఇక వాట్సాప్ స్టేటస్‌కు అవతార్‌లతో రిప్లై - కొత్త ఫీచర్‌తో రానున్న మెటా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial