WhatsApp Upcoming Feature: భారతదేశంలో 55 కోట్లకు పైగా ప్రజలు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి కంపెనీ దానికి కొత్త ఫీచర్లను జోడిస్తూనే ఉంది. ఇంతలో కంపెనీ కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్‌ను అందించింది.
ఈ ఫీచర్ ద్వారా త్వరలో మీరు అవతార్ ద్వారా కూడా వాట్సాప్ స్టేటస్‌కు రిప్లై ఇవ్వగలరు. ప్రస్తుతం సాధారణంగా వాట్సాప్‌లోని స్టేటస్‌కి ఎమోజీలు, మెసేజ్‌ల ద్వారా రిప్లై ఇస్తున్నాం. త్వరలో దీని అవతార్‌కు సంబంధించిన మరో ఆప్షన్ కూడా యాడ్ కానుంది. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను పర్యవేక్షించే Wabetainfo వెబ్‌సైట్ షేర్ చేసింది.
Wabetainfo తెలుపుతున్న దాని ప్రకారం ఎమోజీల లాగానే యూజర్లకు రిప్లై ఇవ్వడానికి కంపెనీ ఎనిమిది అవతార్ల ఎంపికను ఇస్తుంది. అవతార్ల ద్వారా యూజర్లు తమ భావాలను ఎమోజీ కంటే మెరుగైన రీతిలో వ్యక్తీకరించవచ్చు. అలాగే యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా మెరుగుపరుస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు కూడా ముందుగా వాట్సాప్ అందించే అన్ని కొత్త ఫీచర్లను ముందుగా పొందాలనుకుంటే, మీరు బీటా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవచ్చు.
మెటా ఇటీవల వాట్సాప్‌లో వ్యక్తులకు హెచ్‌డీ ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేసే ఫీచర్‌ను అందించింది. హెచ్‌డీ ఫోటోను షేర్ చేయడానికి, మీరు ఫోటోను షేర్ చేసేటప్పుడు హెచ్‌డీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అదేవిధంగా హెచ్‌డీ వీడియోను షేర్ చేయడానికి, మీరు వీడియోను షేర్ చేసేటప్పుడు స్టాండర్డ్‌కు బదులుగా హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
యూజర్‌నేమ్, రీసెంట్ హిస్టరీ షేర్, మల్టిపుల్ అకౌంట్ లాగిన్ మొదలైన అనేక కొత్త ఫీచర్లపై వాట్సాప్ పని చేస్తోంది. త్వరలో మీరు ఇన్‌స్టాగ్రామ్ వంటి వాట్సాప్‌లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవగలరు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు మారినట్లే, వాట్సాప్‌లో కూడా అదే చేయవచ్చు.
ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం వాట్సాప్ డజన్ల కొద్దీ అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. కాలక్రమేణా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడం వాట్సాప్ లక్ష్యం. త్వరలో కంపెనీ యూజర్‌నేమ్ ఫీచర్‌ని కూడా రోల్‌అవుట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది వాట్సాప్ నంబర్ షేరింగ్‌ను ఎలిమినేట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా నంబర్ లేకుండా వాట్సాప్‌లో ఛాట్ చేసుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం గూగుల్ ‘కాల్ స్విచ్చింగ్’ అనే ఫీచర్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. ఒకే గూగుల్ అకౌంట్‌తో డివైస్‌లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడానికి సహాయపడే ఈ ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ పని చేస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆండ్రాయిడ్ నిపుణుడు మిషాల్ రెహమాన్ కూడా ఎక్స్‌లో (ట్విట్టర్) ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial