ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లు గ్లోబల్ లాంచ్ అయ్యాయి. యాపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్లో ఇవి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్ కంటే ఇందులో హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్లు చేశారు. వీటిలో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఈ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. గతేడాది ప్రో మోడల్స్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు స్టాండర్ట్ వేరియంట్స్‌లో అందించారు. వీటిలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు.


ఐఫోన్ 15 ధ‌ర, సేల్ వివరాలు
ఐఫోన్ 15 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.89,900గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 512 జీబీ స్టోరేజ్ ధర రూ.1,09,900గా ఉంది. దీనికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. కొన్ని బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ప్రత్యేక ఆఫర్ కూడా లభించనుంది. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ఇదే ధరతో లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం రూ. 70 వేల లోపు ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు.


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ఐఫోన్ 15 ప్లస్ ధ‌ర‌, సేల్ వివరాలు
దీని ప్రారంభ వేరియంట్ అయిన 128 జీబీ స్టోరేజ్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.99,900గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 512 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.1,19,900కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్ కూడా సెప్టెంబర్ 22వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్ చేయవచ్చు.


ఐఫోన్ 15, 15 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 15లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా ఉంది. గతేడాది ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ వీటిలో కూడా అందించారు. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను  ఐఫోన్ 15 అందించనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఉంది.


ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌ల్లో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరా అందించారు.


ఏ16 బయోనిక్ చిప్‌పై ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లు పని చేయనున్నాయి. గతేడాది ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఈ ప్రాసెసర్ అందించారు. యూఎస్‌బీ టైప్-సీతో లాంచ్ అయినమొదటి ఐఫోన్ సిరీస్ ఇదే. ర్యామ్, బ్యాటరీ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. థర్డ్ పార్టీ వ్యక్తుల ద్వారా ఈ ఫీచర్లు త్వరలో బయటపడే అవకాశం ఉంది.


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial