Just In





iPhone 15: ఐఫోన్ 15 సిరీస్ సేల్ ఎప్పుడు జరగవచ్చు? - ఎక్కడ అందుబాటులో ఉంటాయి?
Apple Event 2023: ఐఫోన్ 15 సిరీస్ సేల్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

iPhone 15 Launch: ఐఫోన్ 15ని కొనుగోలు చేయడానికి మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మీరు ఐఫోన్ 15 సిరీస్‌ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు అయితే, దీని సేల్ తేదీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. కంపెనీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. కానీ భారతదేశంలో ఐఫోన్ 15 సిరీస్ సేల్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మీరు అమెజాన్ః, యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యాపిల్ స్టోర్ నుంచి ఐఫోన్ 15 సిరీస్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాదిలోనే కంపెనీ ఢిల్లీ, ముంబైలలో రెండు కొత్త అధికారిక స్టోర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఐఫోన్ 15 సిరీస్ రూ. 79,900 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఈసారి మీరు ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ల్లో గరిష్టంగా 2 టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్‌ను పొందే అవకాశం ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్‌లో 6x జూమింగ్ సౌకర్యం అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. ఈసారి మీరు గ్రే, సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ప్రో మోడల్‌లను కొనుగోలు చేయవచ్చని కూడా చెబుతున్నారు. ఈ పుకార్లన్నిటికీ మరి కాసేపట్లో తెర పడనుంది.
యాపిల్ లాంచ్ ఈవెంట్‌ను ఎలా చూడవచ్చు?
యాపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్‌ను చూడటానికి మీరు కంపెనీ యూట్యూబ్ ఛానెల్, యాపిల్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. కొన్ని కారణాల వల్ల మీరు ఈ ఈవెంట్‌ను మిస్ అయితే, ఏబీపీ దేశంలో లైవ్ అప్‌డేట్స్, ఈవెంట్ స్టోరీలను చూడవచ్చు.
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial