యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లను తీసుకొచ్చే వాట్సాప్‌.. ఈసారి మరో ఫీచర్ తీసుకురానుంది. వాట్సాప్‌లో మనకు వచ్చే మెసేజ్‌లు ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయ్యేలా డిస్‌అప్పియరింగ్‌ మెసేజెస్ ఆప్షన్ ఉన్న విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ నెలలో దీనిని ప్రవేశపెట్టింది. దీంట్లో 24 గంటలు, వారం అనే ఆప్షన్లు ఉంటాయి. దీంట్లో మనం ఒక ఆప్షన్ ఎంచుకుంటే నిర్దేశించిన సమయం తర్వాత మెసేజ్‌లు ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయిపోతాయి. ఒకవేళ మనకు ఈ ఫీచర్ అవసరం లేదు అనుకుంటే ఆఫ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.


ఇప్పుడు డిస్‌అప్పియరింగ్‌ విండోలో కొత్తగా 90 రోజులు అనే ఆప్షన్ రానుంది. దీని ద్వారా మనకు వచ్చే మెసేజ్‌లు 90 రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయిపోతాయి. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది విజయవంతం అయితే త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది. 


Also Read: WhatsApp Tricks: వాట్సాప్ లో మెసేజ్ చేసి డిలిట్ చేశారా? ఏం పర్లేదు.. ఇలా చూసేయోచ్చు..


డబ్ల్యూబీటా ఇన్ఫో స్క్రీన్ షాట్..
వాట్సాప్ ఫీచర్లకు సంబంధించిన అప్‌డేట్లను అందించే డబ్ల్యూఏబీటా ఇన్ఫో (WABetaInfo) ఈ వివరాలను వెల్లడించింది. టెస్టింగ్ దశలో భాగంగా ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా 2.21.17.16 వెర్షెన్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది.  



పేమెంట్స్ ఆప్షన్ కూడా...
ఇటీవల వాట్సాప్ యూజర్ల కోసం.. పేమెంట్స్ అనే కొత్త ఆప్షన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా లావాదేవీలు చేయవచ్చు. మనం లావాదేవీలు చేసేటప్పుడు.. బ్యాక్ గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు. కేవలం భారతీయ యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. మనం ఈ డబ్బులు పంపేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ థీమ్ తో మన భావాలను వ్యక్తపరచవచ్చు.


బ్యాక్ గ్రౌండ్ థీమ్ మార్చాలంటే ముందుగా డబ్బులు పంపాలనుకునే వారి కాంటాక్ట్‌ ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఎంత డబ్బు పంపిస్తున్నారనే వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌ అనే ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. నచ్చిన థీమ్‌ల కోసం స్క్రోల్‌ చేసి సెలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ ఆప్షన్‌ను డిస్మిస్‌ చేసి చెల్లింపులు చేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ యాడ్‌ చేసిన తర్వాత కూడా లావాదేవీ మార్చుకునే సదుపాయం ఉంటుంది.


Also Read: WhatsApp New Feature: వాట్సాప్‌ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు అలా అలా..


Also Read: WhatsApp Payments: వాట్సాప్‌ పేమెంట్స్‌ చేస్తున్నారా? అవతలి వారికి మీ ఫీలింగ్ ఎంటో థీమ్ తో చెప్పెయండిలా..